నారాయణపేట, డిసెంబర్ 20 : శాంతి భద్రతలను పర్యవేక్షించే బాధ్యత పోలీసులపై ఉంద ని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. ప ట్టణంలోని ఎస్పీ కార్యాలయం లో జిల్లాలోని బ్లూకోట్స్, పెట్రోల్ కార్స్ సిబ్బందికి మంగళవారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ డయల్ 100 కాల్స్‌పై తక్షణమే స్పందించి ఘటనా స్థలంలో బాధితులకు సేవలు అందించాలన్నారు. బ్లూకోట్స్, పెట్రోల్ కార్స్ సిబ్బంది క్రమశిక్షణ, సమయపాలన, వృత్తిపై బాధ్యత వహించాలన్నారు. నేర ప్రకృతి గల వ్యక్తులపై, పాత నేరస్తు ల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. జన సమర్థత గల ప్రదేశాల్లో విజిబుల్‌గా ఉంటూ ప్రజల్లో భద్ర తాభావం పెంపొందించాలన్నారు. కమ్యూనిటీ స మావేశాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై, సైబర్‌నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీలు సత్యనారాయ ణ, వెంకటేశ్వరరావు, ఆర్ఐ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.