ఊట్కూర్, అక్టోబర్ 17 : అధికారులు అప్రమత్తంగా ఉండి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని నారాయణపేట ఎస్పీ శ్రీహర్ష, ఎస్పీ యోగేష్‌గౌతమ్ స్పష్టం చేశారు. మంగళవారం మండలంలోని ఊట్కూర్, చిన్నపొర్ల, పెద్దపొర్ల, పులిమామిడి, బిజ్వారం, కొత్తపల్లి గ్రామాలను కలెక్టర్, ఎస్పీ సందర్శించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లను పరిశీలించారు. సమస్యాత్మక గ్రామాల్లో ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తీసుకోవాల్సిన జా గ్రత్తలను రెవెన్యూ, పోలీస్ అధికారులకు వివరించారు. ఎన్నికల కమీషన్ ఆదేశానుసారంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అన్ని సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు స హకరించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్, డీ ఎస్పీ సత్యనారాయణ, సీఐలు రామ్‌లాల్, శ్రీకాంత్‌రెడ్డి, ఎస్సై గోకారి, తాసీల్దార్ శివశ్రీనివాస్, ఎంపీడీవో రమేశ్‌కుమార్, సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి, డీటీ షమీమ్ సుల్తానా, ఆర్ఐలు రాఘవేంద్రారెడ్డి, వెంకటేశ్ పాల్గొన్నారు.
ఏర్పాట్లు పూర్తి చేయాలి
పట్టణ శివారు లోని దత్త బృందావన్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష, ఎస్పీ యోగేష్ గౌతమ్అధికారులను ఆదేశించారు. మంగళ వా రం పట్టణ శివారులోని దత్త బృందావన్ కళాశాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కళాశాల వద్ద బారికెడ్లు, పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలన్నారు. మరమత్తులు ఉంటే త్వరగా పూర్తి చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు, డీఎస్పీ సత్యనారాయణ ఉన్నారు.