Kollapur | కొల్లాపూర్, ఏప్రిల్ 14 : నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల నమస్తే తెలంగాణ రిపోర్టర్ రమణకి పితృవియోగం కలిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్ట్ రమణ తండ్రి కటిక నారాయణ మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. మంగళవారం కొల్లాపూర్ మండల రామాపురం గ్రామంలో రమణ స్వగృహం వద్ద కటిక నారాయణ పార్థీవ దేహానికి మండలానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నేతలు, కొల్లాపూర్ నియోజకవర్గ జర్నలిస్టు మిత్రులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అలాగే నమస్తే తెలంగాణ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బ్యూరో ఇంచార్జి వెంకటేశ్వరరావు, ఎడిషన్ ఇంచార్జి నరేష్ కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా ఇంచార్జి ప్రదీప్ కుమార్లతోపాటు నమస్తే తెలంగాణ బృందం కటిక నారాయణ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పితృవియోగం కలిగిన జర్నలిస్ట్ రమణను ఓదార్చి మనోధైర్యం కల్పించారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కూడా జర్నలిస్ట్ రమణ కుటుంబాన్ని పరామర్శించారు.