అచ్చంపేట రూరల్, జూలై 5 : నల్లమలను ప్రత్యేక పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకుంటున్నదని ఎైక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సిం హ, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ఆయన టూరిజం శాఖ ప్రత్యేక బస్సులో నల్లమలలో రెండు రోజుల స్టడీ టూర్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర ఆలయం వద్దనున్న పాపనాశనిలో స్నానా లు చేసి అమ్మవారికి కుంకుమార్చన, స్వామికి అభిషేకం, పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రూ.50 లక్షలతో ఆలయం ముందుభాగాన్ని విస్తరించి భక్తులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలన్నారు. ఎకో టూరిజం అభివృద్ధిపై ఇద్దరు మంత్రులు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో మేధోమథనం చేయడానికి నల్లమలలో రెండ్రోజులు క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు.
పర్యాటక అభివృద్ధి, మౌలిక వసతుల ఏర్పాట్లు, యువతకు ఉపా ధి అవకాశాలు వంటి అంశాలపై చర్చించనున్నారు. అంతకుముందు నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, మంత్రు లు, ఎమ్మెల్యేల బృందానికి పూలమొక్కలు అందిం చి స్వాగతం పలుకగా.. ఆలయ చైర్మన్ సుధాకర్, ఈవో శ్రీనివాసరావు, అర్చకులు పూర్ణకుంభంతో ఆలయంలోకి స్వాగ తం పలికారు. పూజల అనంతరం వారికి తీర్థప్రసాదాలను అందజేశారు. అంతకుముందు కొం డకింద రంగాపూర్ హజ్రత్ నిరంజన్ షేక్ షావలీ దర్గాలో వారు ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కశిరెడ్డి నారాయణరెడ్డి, రాజేశ్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, మేఘారెడ్డి, వీర్లపల్లి శంకర్, మధుసూదన్‌రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాశ్‌రెడ్డి, పురావస్తుశాఖ డైరెక్టర్ భారతి హోళిఖేరి, పర్యాటక శాఖ డైరెక్టర్ ఈల త్రిపాఠి, జిల్లా అటవీశాఖ అధికారి రోహిత్ గోపిడి, ఐఎస్ఎఫ్ సుశాంత్ పాల్గొన్నారు.
40లక్షల మొక్కలు టార్గెట్..
మొక్కలు నాటి వనాలను పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని మం త్రులు జూపల్లి, రాజనర్సింహ అన్నారు. శుక్రవా రం 75వ వనమహోత్సవ కార్యక్రమంలో భాగం గా మన్ననూర్ చింతలచెరువులోని రెవెన్యూ భూ ముల్లో విద్యార్థులు, ఎమ్మెల్యేలతో కలిసి మొక్కలను నాటారు. కార్యక్రమంలో పర్యాటక, సాం స్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి వాణిప్రసాద్, పీసీసీఎఫ్ డోబ్రియల్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మీడియాకు నో ఎంట్రీ..
టూరిజం హబ్‌గా మా ర్చేందుకు అవసరమైన ప్రాంతాలను పరిశీలించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు శుక్రవారం మండలంలోని పర్యాటక ప్రదేశాలకు వెళ్లారు. అయితే అటవీ, టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మీ డియాకు అనుమతిలేదని సంబంధిత అధికారులు తెలిపారు. కానీ మంత్రు లు, ఎమ్మెల్యేలతోపాటు కొందరు కాంగ్రెస్ నాయకులకు మాత్రం సఫారీ వాహనాన్ని ఏర్పాటు చే యడమేంటని పలువురు చర్చించుకుంటున్నారు.