Thunderbolt : అకాల వర్షం అన్నదాతలకే కాదు గొర్ల కాపరులకు తీవ్రమైన నష్టం చేకూరుస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం లింగసానిపల్లి గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం పిడుగుపాటు (Thunderbolt)కు 30 గొర్రెలు మృతి చెందాయి.
తిమ్మాజీపేట మండలం చేగుంట గ్రామానికి చెందిన నడిపి చెన్నయ్య తన గొర్రెలను లింగసానిపల్లి గ్రామ సమీపంలో మేపుతుండగా సాయంత్రం అకస్మాత్తుగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగు పడడంతో మందలోని 30 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. పిడుగుపాటుకు భారీ సంఖ్యలో గొర్రెలు మరణించడంతో చెన్నయ్య గుండెలు బాదుకున్నాడు. ప్రకృతి వైపరీత్యం కారణంగా గొర్రెలను కోల్పోయిన చెన్నయ్యను ఆర్ధికంగా ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.