వెల్దండ మార్చి 21: ప్రభుత్వం తమకు హామీ ఇచ్చి మోసం చేసిందని ఆశా వర్కర్లు మండిపడ్డారు.. శుక్రవారం వెల్దండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ధర్నా నిర్వహించారు.. అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చి నెరవేర్చడం లేదని ఆరోపించారు.. తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఆశ వర్కర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు స్వప్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.. ఏఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన ఆశలకు ఏఎన్ఎం పోస్టులో ప్రమోషన్ సౌకర్యం కల్పించాలన్నారు. డిసెంబర్ 10న ఆరోగ్య కమిషనర్ గారు ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలన్నారు గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆశలకు ఇన్సూరెన్స్ రూ.50 లక్షలు చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
గ్రామాల్లో ప్రతినిత్యం ప్రజల ఆరోగ్యం బాగోగులు చూసుకుంటూ వెట్టి చాకిరీ చేస్తున్న మాకు కనీస గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హామీ ప్రకారం ప్రసూతి సెలవులు కల్పిస్తూ ఉంటే ఇతరులు జారీ చేయాలన్నారు. ఆశాలకు పూర్ణం క్లాత్ తో కూడిన క్వాలిటీ యూనిఫార్మ్స్ ఎండాకాలంలో కాటన్ యుగంసివ్వాలన్నారు. ఆశా వర్కర్లకు చేస్తున్న పారితోషకం లేని పనులన్నింటిని రాష్ట్రప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఆశా వర్కర్లకు ప్రతి సంవత్సరం 20 రోజుల వేతనంతో కూడిన జాజువల్ సెలవులు ఇవ్వాలని ఆరు నెలల మెడికల్ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని జిల్లా ఉపాధ్యక్షురాలు స్వప్న హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు బాలమణి, మంగమ్మ, సుజాత, యాదమ్మ, వసంత, భారతి, రోజా, లక్ష్మమ్మ, పద్మావతి , రాణి బాయి తదితరులు ఉన్నారు.
ధన్వాడలో..
ఆశ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పదోన్నతులు కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు కనీస వేతనాన్ని 9000 నుండి 18 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నాడు ధన్వాడ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఆశా వర్కర్లు స్థానిక ప్రభుత్వాసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు అనంతరం వైద్యాధికారికి డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు కార్యక్రమంలో సంఘం నాయకులు జ్యోతి, విజయలక్ష్మి, అంజలి, మని శాంతి, మాసనమ్మ, మంగమ్మ, నిర్మల, యశోద సబేర బేగం తదితరులు పాల్గొన్నారు.