Rain Damage | నాగర్ కర్నూలు జిల్లాలో గాలివాన బీభత్సం.. తడిసిముద్దైన వడ్లు, మొక్కజొన్న..!
Rain Damage : నాగర్ కర్నూలు జిల్లాలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. వాతావరణంలో మార్పులు రావడంతో బలమైన గాలులు వీచాయి. ఈదురు గాలుల ధాటికి పలు చోట్ల వృక్షాలు నేలకొరిగాయి.
Rain Damage : నాగర్ కర్నూలు జిల్లాలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. మంగళవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడంతో బలమైన గాలులు వీచాయి. ఈదురు గాలుల ధాటికి పలు చోట్ల వృక్షాలు నేలకొరిగాయి. వ్యవసాయ మార్కెట్లో రైతులు అమ్మకానికి తీసుకొచ్చిన వడ్లు, మొక్కజొన్న తడిసిముద్దయ్యాయి. కాంటా చేయని ధాన్యం తడిసిపోవడంతో రైతులు ‘అయ్యో.. చెడగొట్టు వాన ఎంత పనిచేసింది’ అని గగ్గోలు పెట్టారు.
వాతావరణ మార్పులతో ఈదురుగాలుల ఉధృతికి భారీ ఫ్లెక్సీలు చిరిగిపోగా.. ఉరుముల శబ్దాలకు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. గాలి గందరగోళం నుంచి తేరుకోకముందే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉన్నట్టుండి వాన పడడంతో రోడ్లపై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు
పడ్డారు. భారీ వర్షం పడే అవకాశమున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

