అచ్చంపేట రూరల్, జులై 05 : రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్లు వెంటనే చెల్లించాలని ఎస్ఎఫ్ఐ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ సయ్యద్ అన్నారు. ఎస్ఎఫ్ఐ అచ్చంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం పెండింగ్లో ఉన్న రూ.8 వేల కోట్ల స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అచ్చంపేట పట్టణంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా సయ్యద్ మాట్లాడుతూ.. స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ అందక పేద విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
విద్యార్థులకు కళాశాల యజమాన్యాలు సర్టిఫికెట్లు కూడా ఇస్తలేవన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులు చెల్లించాలని, లేనియెడల ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ టౌన్ కమిటీ సభ్యులు విజయ్, చరణ్, సమీర్, సాయి, ప్రవీణ్, రాజు పాల్గొన్నారు.