
నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ కేసరి సముద్రం మినీ ట్యాంక్‌బండ్ పనులను దసరా నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ పి.ఉదయ్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని కేసరి సముద్రం చెరువు మినీ ట్యాంక్‌బండ్ సుందరీకరణ పనులను అధనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి పరిశీలించారు.
పట్టణ ప్రజలు పిల్లలతో కలిసి సాయంత్రం వేళల్లో సేద తీరేందుకు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేలా చెరువు సుంద రీకరణ, మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3.5 కోట్లు మంజూరు చేసిందన్నారు. కొనసాగుతున్న సుందరీకరణ పనుల వివరాలను తెలుసుకునేందుకు కలెక్టర్ సందర్శించారు.

బతుకమ్మ, దసరా పండుగ ఘనంగా నిర్వహించే ఏర్పాటు చేసే దిశగా దసరా లోపు ఇక్కడ జరుగుతున్న సివిల్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువు వద్ద పచ్చదనం పెంపొందించేలా గ్రీనరీ పనులను చేపట్టాలన్నారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ గోనె అన్వేశ్ ఉన్నారు.