నాగర్‌కర్నూల్, జూన్ 18 : మంత్రి కేటీఆర్ రాకతో శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రం గులాబీమయమైంది. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శం కుస్థాపనలు చేశారు. కొల్లాపూర్ చౌరస్తాలోని నూతన కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకోగానే ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్‌రెడ్డి శాలువాలతో మంత్రిని సత్కరించిన పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మర్రి ఆధ్వర్యంలో మంత్రు లు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ రాము లు, విప్ గువ్వల బాలరాజు, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి, ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, అబ్రహం, జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీలు కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, కశిరెడ్డి నారాయణరెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్‌రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. మొదటగా కొల్లాపూర్ చౌరస్తా నుంచి రూ.కోటీ 20 లక్షలతో ఏర్పాటు చేసిన సైడ్టైట్లను ప్రారంభించారు.
అనంతరం రూ.2 కోట్లలో నిర్మించనున్న జిల్లా గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. రూ. 17 కోట్లతో చేపట్టిన మినీ ట్యాంక్‌బండ్, ట్యాంక్‌బండ్ సుందరీకరణ పనులను ప్రారంభించారు. ట్యాంక్‌బండ్‌పై బుద్ధ విగ్రహానికి ఎదురుగా రూ.25 లక్షలతో ఏర్పాటు చేసిన భారీ జాతీయ జెం డాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అక్కడి నుంచి పాత మార్కెట్ యార్డు వద్ద రూ.7 కోట్లతో చేపట్టనున్న టౌన్‌హాల్ నిర్మాణానికి, రూ. 4.50 కోట్లతో చే పట్టనున్న నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణానికి, రూ.6 కోట్ల తో చేపట్టనున్న ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన ము న్సిపల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతకుముందు కొల్లాపూర్ చౌరస్తా నుంచి ప్రత్యేక వాహనం లో కేటీఆర్ పలు అభివృద్ధి పనులను పరిశీలిస్తూ రోడ్డు పొ డవునా రాగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా పట్టణానికి చేరుకున్నారు. అనంతరం బిజినేపల్లి మండలంలోని బహిరంగసభకు మం త్రి తరలివెళ్లారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కల్పన, వైస్ చైర్మన్ బాబురావు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.