కొల్లాపూర్ రూరల్, ఫిబ్రవరి 22 : పేదోడి ఆపిల్గా పిలిచే జామకు విశిష్ట స్థానం ఉన్నది. ఈ పండులో అధికంగా లభిం చే విటమిన్ ‘సి’ ఎంతో మేలు చేస్తుంది. మధుమేహం, ఊబకాయం వ్యాధిగ్రస్తులకు జామ పండు, ఆకు రసం ఆరోగ్య ప్ర దాయినిగా పనిచేస్తుంది. ఉదయం పూట జామ ఆకుల కషాయాన్ని తాగితే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఇంతటి ఔషధ గుణాలున్న జామ తోటను సాంప్రదాయ పద్ధతిలో సాగు చేయడం వల్ల చెట్లు ఏపుగా పెరిగి దిగుబడి తక్కువగా వస్తున్నట్లు ఉద్యానవన శాఖాధికారులు చెబుతున్నారు. ఈ పద్ధతిలో ఎకరాకు కేవలం 4-5 టన్నుల దిగుబడి మాత్రమే వస్తుంది. అందుకే మెడో పద్ధతిలో సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందంటున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అధిక, అత్యధిక సాంద్రతలో మొక్కలు నాటి సాగు చేస్తున్నారు. ఈపద్ధతిని ‘మెడో’ అంటారు. మొక్కపరిమాణాన్ని అవసరం మేరకు కత్తిరించడంతో వెలుతురు బాగా ప్రసరిస్తుంది. దీంతో దిగుబడి ఎక్కువ వస్తుంది.
మెడో పద్ధతి సాగు విధానం..
సాంప్రదాయ పద్ధతిలో 6 మీటర్ల దూ రం చొప్పున ఎకరానికి 112 మొక్కలు మాత్రమే నాటుతారు. అదే మెడో పద్ధతిలో 2 మీ., 1 మీ. దూరంలో ఎకరాకు రెండు వేల మొక్కలు నాటుకోవచ్చు. ఈ రెండు పద్ధతుల్లో చెట్ల సంఖ్యకు చాలా వ్యత్యాసం ఉండడంతో దిగుబడి ఎక్కువ వ స్తుంది. వాణిజ్య రకాలైన అలహాబాద్ సఫీ ద్, లక్నో-49 మెడో విధానానికి అనుకూలంగా ఉంటాయి. చలి ఎక్కువగా ఉండే డిసెంబర్, జనవరి నెలల్లో తప్పా ఎప్పుడై నా మొక్కలు నాటుకోవచ్చు. ఒకటిన్నర అ డుగుల పరిమాణంలో పొడవు, వెడల్పు, లోతు ఉండేలా గోతులు తీసి 10 నుంచి 15 కిలోల పశువుల ఎరువు, 500 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ కలి పి గుంతల్లో నింపాలి. ఆ తరువాత మొక్కలు నా టాలి. మొక్కల కాండంపై 30-40 సెం.మీ. వరకు పక్క కొమ్మలు పెరగనివ్వొద్దు. సుమారు 40 సెం.మీ. ఎత్తు వద్ద ప్రధాన కాండాన్ని కత్తిరించాలి. ఇలా కత్తిరించిన 20 రోజుల తరువాత కొత్తచిగుర్లు వస్తాయి. అందులో నాలుగు కొమ్మలు ఉంచి మిగ తా వాటిని తీసేయాలి.
ఈ కొమ్మలు 3-4 నెలలు పెరిగిన తరువాత 50 శాతం వరకు కత్తిరించాలి. మళ్లీ కొత్తచిగుర్లు వచ్చినప్పుడు నాలుగు కొమ్మలు ఉంచి మిగతా వాటిని తొలగించాలి. ఈ కొమ్మలు 3-4 నెలలు పెరిగిన తరువాత 50 శాతం వరకు కత్తిరించాలి. ఆ తరువాత కొత్తగా వచ్చే కొమ్మలపై పూత పిందె ఏర్పడుతాయి. ఇలా చేయడం వల్ల మొక్కలు కావాల్సిన ఆకారం సంతరించుకుంటా యి. రెండో ఏడా ది కూడా కొమ్మలు కత్తిరించాలి. ఇలా చేయడం వల్ల మొక్కలను 2.5 మీ ఎత్తు, 2 మీ.వెడల్పు వరకు నియంత్రించుకోవచ్చు. జనవరి-ఫిబ్రవరి, మే-జూన్ నెల ల్లో కొమ్మ కత్తిరింపులు చేపట్టాలి. ప్రతి ఏడాది ఎం డిన, అడ్డదిడ్డంగా ఉన్న కొమ్మలను తొలగించాలి. గతేడాది కాపు కాసిన కొమ్మలను నాలుగింట మూ డో వంతు కత్తిరిస్తే పక్క కొమ్మలపై కాపు బాగా వ స్తుంది. కాయలను చిన్న కొమ్మలతోపాటే కోయడం వల్ల కూడా ఇదే రకమైన ఫలితాన్ని పొందొచ్చు. కా పు పూర్తయిన తర్వాత మే నెలలో 50 శాతం వరకు కొమ్మలను కత్తిరించాలి.
దీంతో వర్షాకాలపు కాపు ను నియంత్రించొచ్చు. సెప్టెంబర్ నుంచి జనవరి వరకు శీతాకాలపు కాపు కోతకు వస్తుంది. యాజమాన్య పద్ధతిలో సాగు చేస్తే రెండో సంవత్సరంలోనే కాపు వస్తుంది. మూడో ఏడాది నుంచి లాభదాయకమైన దిగుబడులు వస్తాయి. లేత ఆకుపచ్చ రం గులో ఉన్న కాయలు కోయాలి. అధిక సాంద్రతలో జామ సాగుచేస్తే చెట్టుకు 10-15 కిలోల చొప్పున ఎకరాకు 8 నుంచి 10 టన్నులు, అత్యధిక సాంద్రతలో సాగు చేస్తే 10 నుంచి 20 టన్నుల దిగుబడి వస్తుంది.
లబ్ధిదారులను గుర్తించాం..
దళితబంధు పథకంలో భాగంగా నియోజకవర్గానికి వంద మంది చొప్పున లబ్ధిదారులను గుర్తించాం. ప్రభుత్వానికి పేర్లను నివేదించాం. కల్వకుర్తిలో మొదట అవగాహన నిర్వహిస్తున్నాం. లబ్ధిదారులు కోరుకున్న యూనిట్లను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. కలెక్టర్,ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పథకం అమలుకుఏర్పాట్లు చేస్తున్నాం.
– రాంలాల్, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి, నాగర్కర్నూల్
తగినంత ఎరువులు వాడాలి..
నేల స్వభావాన్ని బట్టి తగినంత మోతాదులో ఎరువులు వాడి, సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడి వస్తుంది. మొక్కలు నాటిన మొదటి ఏడాది 50 గ్రాముల యూరియా వాడాలి. పిందె దశలో పొటాషియం ఎరువులు వేసుకుంటే కాయ సైజుతోపాటు నాణ్యత పెరుగుతుంది. ప్రతి ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కొమ్మలు కత్తరిస్తే శీతాకాలంలో కాయకు మంచి కాపు వస్తుంది. రైతులు ప్రస్తుతం మామిడితోటల్లో కొంతభాగం జామ, సపోట తోటలను పెంచి ఏడాదంతా పని ఉండేలా చూసుకుంటున్నారు. ఇది కూడా చాలా మంచి పద్ధతి.
– లక్ష్మణ్, ఉద్యానవన శాఖాధికారి, కొల్లాపూర్