నాగర్‌కర్నూల్, ఫి బ్రవరి 21 (నమ స్తే తెలంగాణ) : ప్రభుత్వ భూ ముల క్రమబద్ధీకరణపై ప్ర భుత్వం తుది నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి కే పోడు, అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు యోచిస్తున్న ప్రభుత్వం.. తాజాగా ప్రభుత్వ స్థలా ల క్రమబద్ధీకరణ దిశగా చర్యలు చేపట్టింది. ఇందుకోసం రెండు రోజుల కిందట సీఎస్ సోమేశ్‌కుమార్ జీవో 14 పేరుతో ఉత్తర్వులు జారీ చేశారు. చాలా ప్రాంతాల్లో పేదలు ఇండ్లు నిర్మించుకు న్నా గుర్తింపు లేదు. అలాంటి వారికి ఈ జీవోతో ఊరట క లగనున్నది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ని ఉప సంఘం విచారణ నిర్వహించి క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించేందుకు ప్రభుత్వానికి నివేదించగా, ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం జూన్ 2, 2014 నాటికి ఆక్రమణలో ఉన్న భూములను క్రమబద్ధీకరణ చేసే అవకాశం ఉన్నది. ఇంతకుముందు ఉన్న 58, 59 పేరుతో ఉన్న జీవోలకు కొనసాగింపుగా జీవో 14 విడుదల చేసింది. దీనికిగానూ ఈనెల 21 నుంచి మార్చి 31వ తేదీ వరకు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ప్రభు త్వం సూచించింది. ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డుతోపాటు స్థలం తమ ఆధీనంలో ఉన్నట్లుగా నిరూపించే డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఆస్తి పన్ను రశీదు, విద్యుత్ బిల్లులు, తాగునీటి బిల్లు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల వంటివి జతపర్చాలి. అయితే, ఖాళీ స్థలాలను మాత్రం క్రమబద్ధీకరణ చేయడం లేదు. అలాగే వివాదాల్లేని ప్రభు త్వ భూములు, పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టంలోని మి గులు భూములకు మాత్రమే క్రమబద్ధీకరణకు వర్తిస్తుంది. అయితే, ఇప్పటికే ఉన్న స్థలాల్లో ఏమైనా నిర్మాణాలు ఉంటేనే ఈ జీవో వర్తిస్తుంది.
కలెక్టర్లు దీనిపై చర్యలు తీసుకుంటారు. దీనికి ఆర్డీవోలు చైర్మన్లుగా, తాసిల్దార్లు సభ్యులు గా ఉన్న కమిటీ తుదినిర్ణయం తీసుకుంటుంది. తాసిల్దార్లు దరఖాస్తుదారుల కుటుంబాల్లోని మహిళల పేరు మీద క్వే యన్స్ డీడ్‌ను చేసి ఇస్తారు. ఏవైనా సమస్యలుంటే అదనపు కలెక్టర్లకు నివేదించి చర్యలు తీసుకుంటారు. ఇక 250 చదరపు గజాల్లోపు స్థలం ఉంటే 50 శాతం, 500 గజాల వర కు స్థలాలకు 75 శాతం సొమ్మును ఫీజుగా చెల్లించాల్సి ఉం టుంది. ఇక నివాసేతర భూములకు విస్తీర్ణంతో సంబంధం లేకుండా కనీస ధర పూర్తిగా చెల్లించాలి. దీని ప్రకారం 125 చదరపు గజాల్లోని స్థలాల్లోపు ఆక్రమించుకున్న ఇండ్లను ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు గ్రామాలతో పోలిస్తే పురపాలికల్లో అధికంగా ఉన్నాయి. బీసీ కాలనీల్లో అధికంగా ఇలాంటి నిర్మాణాలున్నాయి. చాలా చోట్ల వివాదాస్పదంగా మారి కోర్టు కేసులకు సైతం వెళ్తున్నారు. ఇది మున్సిపల్, రెవెన్యూ అధికారులకు తలనొప్పిగా మారుతున్నది. సామాన్యుల నుంచి ఫిర్యాదులు, రాజకీయ ఒత్తిళ్లు అధికమవుతున్నాయి. ఈ క్రమంలో ఎట్టకేలకు ప్రభుత్వం క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవడంతో సమస్య తీరనున్నది. ప్రభుత్వ విధానం మేరకు సోమవారం నుంచి మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేసుకునే ప్రక్రి య ప్రారంభమైందని, ప్రభుత్వ ఉత్తర్వులు, కలెక్టర్ ఆదేశాల మేరకు క్రమబద్ధీకరిస్తామని, త్వరలో పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు విడుదలవుతాయని నాగర్‌కర్నూల్ మున్సిపల్ కమిషనర్ అన్వేశ్ తెలిపారు.