కొల్లాపూర్, జూన్ 28 : నాగర్ కర్నూల్ జిల్లా కెమిస్ట్ & డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి పదవికి జరిగిన ఎన్నికల్లో కొల్లాపూర్ పట్టణానికి చెందిన వేములవాడ నాగరాజు భారీ మెజార్టీతో గెలుపొందారు. జిల్లా కెమిస్ట్ భవనంలో నిర్వహించిన ఈ ఎన్నికలో అధ్యక్షుడిగా ఆకుతోట సాయిబాబు నాగర్ కర్నూల్, జనరల్ సెక్రటరీగా వీరబొమ్మ సురేశ్ కల్వకుర్తి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. ఫార్మసిస్టుల పాత్ర వైద్య విభాగంలో చాలా గొప్పదన్నారు. డాక్టర్లు సూచించిన ప్రకారమే మెడికల్ షాపులలో మందులు ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వం కూడా మెడికల్ షాపుల యాజమాన్యాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారిగా రాష్ట్ర కోశాధికారి రాజు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలు వెంకటేశ్వర్లు, రమేశ్, స్థానిక ఎన్నికల అధికారులుగా సత్యం శ్రీనివాసులు, రామకృష్ణ వ్యవహరించారు.