జడ్చర్ల టౌన్, మే 2 : జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు, ఏజెంట్లు తప్పనిసరిగా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలనే నిబంధన మేరకు ఆదివారం జడ్చర్ల మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించారు. టెస్ట్ సెంటర్ వద్ద ఏజెంట్లు, అభ్యర్థులు, మీ డియా ప్రతినిధులు పరీక్షల కోసం క్యూ కట్టారు. జ డ్చర్ల ఆర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ శివకాంత్ ఆధ్వర్యంలో టెస్టులు చేసి రిపోర్టులు అందజేశారు. మొ త్తం 300 మందికి పరీక్షలు చేయగా.. 14 మందికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ శివకాంత్ తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారికి మందులు పంపిణీ చేశా రు. జిల్లా వైద్యశాఖాధికారి కృష్ణ, డీఎంవో విజయ్‌కుమార్ ర్యాపిడ్ టెస్టు సెంటర్‌ను పరిశీలించారు.