
ఉమ్మడి జిల్లాలో గులాబీ గుబాళింపు
రెపరెపలాడిన టీఆర్ఎస్ జెండా
వాడవాడలా అంబరాన్నంటిన వేడుకలు
స్వీట్లు పంచుకొని పార్టీ శ్రేణుల సంబురాలు
హోరెత్తిన డప్పులు, కుర్వ డోళ్ల చప్పుళ్లు
పంట పొలాలు, చెరువుల వద్ద సందడి
గులాబీ గుబాళించింది.
టీఆర్ఎస్ జెండా రెపరెపలాడింది. వాడవాడలా జెండా పండుగ అంబరాన్నంటింది. పల్లె, పట్నంతోపాటు వ్యవసాయ పొలాలు, చెరువుల వద్ద
ఆహ్లాదకర వాతావరణంలో నిర్వ
హించిన వేడుకలు మరింత జోష్‌ను తీసుకొచ్చాయి. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి గురువారం సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన సందర్భాన్ని పురస్క రించుకొని ఉమ్మడి జిల్లా వేడుకల్లో మునిపోయింది. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, వార్డు కమిటీల అధ్యక్షులు గులాబీ జెండాను ఎగురవేశారు. డప్పులు, కుర్వ డోళ్ల మోతలు హోరెత్తాయి. కార్యకర్తలంతా ఉత్సాహంగా పాల్గొని మిఠాయిలు పంపిణీ చేసుకున్నారు. టీఆర్ఎస్
పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీ నుంచి పార్టీ క్యాడర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వనపర్తి జిల్లా
గోపాల్పేట మండలం తాడిపర్తిలో గొర్రెల మంద వద్ద గొల్లకురుమల ఆధ్వర్యంలో జెండా రెపరెపలాడింది. గొర్రెపిల్లలను ఎత్తుకొని మురిసిపోతూ సంతోషం వ్యక్తం చేశారు. పాన్‌గల్ మండలం దవాజీపల్లిలో
వ్యవసాయ కూలీలతో కలిసి పలువురు నాయకులు సంబురాలు నిర్వహించారు.
మహబూబ్‌నగర్, సెప్టెంబర్2(నమస్తే తెలంగాణ ప్రతినిధి): 2001లో పార్టీ స్థాపించిన తర్వాత అనేక పోరాటాలు చేస్తూ వచ్చిన సీఎం కేసీఆర్ పాలమూరు ఎంపీగా ఉంటూ తెలంగాణ సాధించారు. ఇప్పుడు దేశ రాజధానిలో దక్షిణాది నుంచి ఏ పార్టీకి దక్కని అవకాశాన్ని పొంది టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఇదే రోజున తెలంగాణ వ్యాప్తంగా వాడవాడలా టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు జెండా పండుగను నిర్వహించుకున్నారు. ఉత్తర తెలంగాణలో మాత్రమే టీఆర్ఎస్ పార్టీ ఉందని దక్షిణాదిలో పార్టీయే లేదని చేసిన విమర్శలకు పాలమూరు జనం 2009లో సరైన సమాధానం ఇచ్చారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు ‘మేము సైతం మీ వెంటే’ అంటూ కేసీఆర్‌ను మహబూబ్‌నగర్ ఎంపీగా గెలిపించి ఢిల్లీ పంపించారు. అదే ఢిల్లీలో ఇప్పుడు సగర్వంగా తెలంగాణ భవన్ నిర్మిస్తున్నారు. మహబూబ్‌నగర్ ఎంపీగా సాధించిన తెలంగాణలో ఇప్పుడు అభివృద్ధి పరుగులు పెడుతున్నది. ఒకప్పుడు సాగు, తాగునీటికి ఇబ్బందులు పడగా ఇప్పుడు ఆ కష్టాలు తీరాయి. అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సాధించడంపై టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గురువారం నాడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జెండా పండుగ కార్యక్రమం ఘనంగా జరిగింది. పార్టీ నేతలు, వార్డు కమిటీల అధ్యక్షులు పార్టీ జెండాను ఎగురవేశారు. ఎటుచూసినా టీఆర్ఎస్ పార్టీ జెండా రెపరెపలాడింది. కార్యకర్తలంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ చేపడతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. తెలంగాణకు ముందు తర్వాత పాలమూరులో వచ్చిన అభివృద్ధిని ప్రజలకు తెలియచేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీ నుంచి పార్టీ క్యాడర్‌కు శుభాకాంక్షలు తెలియచేశారు. మిఠాయిలు పంచుకుని సంబురాలు చేసుకున్నారు.
అభివృద్ధితోనే టీఆర్ఎస్లో చేరికలు
బాలానగర్, సెప్టెంబర్2: మండల కేంద్రంతో పాటు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం రాత్రి జడ్చర్లలో ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో బాలానగర్ మండలంలోని ఉటుకుంటతండాకు చెందిన కాంగ్రెస్ నాయకులు రాంసింగ్‌నాయక్ ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధికి టీఆర్ఎస్ పార్టీ మారు పేరు అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సంగీత నాటక మండలి చైర్మన్ బాద్మి శివకుమార్, సింగిల్ విండో డైరెక్టర్ మంజునాయక్, లక్ష్మణ్‌నాయక్, శ్రీనునాయక్, రాజునాయక్, తదితరులు ఉన్నారు.