Alumni | కొల్లాపూర్లోని జీయూపీఎస్లో ఏడో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ( Get Together ) ఆదివారం ఘనంగా నిర్వహించారు. 35 ఏండ్ల తర్వాత పాఠశాల సోమశిలలో కలుసుకుని రోజంతా సరదాగా గడిపారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. అలాగే ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఆదివారం ఉదయం సోమశిలలోని శ్రీ లలితా సోమేశ్వర ఆలయంలో పూర్వ విద్యార్థులు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టూరిజం లాంచిలో ప్రయాణం చేస్తూ కృష్ణమ్మ అందాలను తిలకించారు. యోగ క్షేమాలు అడిగిన తెలుసుకున్న వారు.. పూర్వ విద్యార్థుల్లో ఎవరికి ఇబ్బందులు కలిగినా ఒకరికొకరు సహాయం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
Get Together1
అనంతరం తాము చదివిన పాఠశాలకు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు పూర్వ విద్యార్థులను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలసుకున్నారు. వారి పిల్లలను మంచి మార్గంలో నడిపించాలని సూచించారు.