కొల్లాపూర్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అనుచరుడు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున కొల్లాపూర్ మున్సి పల్ ఎన్నికల్లో 11 వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలిచిన బోరెల్లి కరుణమహేశ్ గురువారం టీఆర్ఎస్లో చేరారు. ముందుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని హైదరాబాద్‌లో మినిస్టర్ క్వార్టర్స్‌లో ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి ద్వారా కౌన్సి లర్ కరుణమహేశ్ మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆనంతరం తన నివాసంలో ఎమ్మెల్యే కౌన్సిలర్ కరుణ కు గులాబీ కండువాను వేసి టీఆర్ఎస్లోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ కరుణ మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపతున్న ఎమ్మెల్యే బీరం హర్ష వర్దన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. ఇదిలాఉండగా మాజీ మంత్రి జూపల్లికి అత్యంత ముఖ్య అనుచరుడైన బొరెల్లి మహేశ్ ఆయన్ని వీడి ఎమ్మెల్యే బీరం బాటలో పయ నించడం పట్ల పట్టణంలో చర్చినీయాంశంగా మారింది. కార్యక్రమంలో టీఆర్ఎస్ కౌన్సిలర్లు పస్పుల కృష్ణ, పొడెండ్ల సత్యం యాద వ్, నార్లాపూర్ ఎంపీటీసీ పాండునాయక్, టీఆర్ఎస్ నాయకులు జూపల్లి ప్రేమరాజరావు, చంద్రశేఖరాచారి, శర్మ, బీరం రాజారెడ్డి, కదిరెపాడు మాజీ సర్పంచ్ రామకృష్ణ, మొచ్చెల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.