నాగర్ కర్నూల్ రూరల్, ఏప్రిల్ 8: నాగర్ కర్నూల్లో కస్తూర్బా గాంధీ బాలికల స్కూల్లో (KGBV) 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. మండల పరిధిలోని నాగనూలు గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో యామినీ అనే విద్యార్థిని 9వ తరగతి చదువుతున్నది. సోమవారం సాయంత్రం ఇంగ్లిష్ స్టడీ అవర్స్‌కు ఆలస్యంగా రావడంతో.. టీచర్ ఆమెను స్టడీహాల్కు వెళ్లేందుకు అనుమతివ్వకుండా మూడు గంటలపాటు నిల్చోబెట్టింది. కనీసం వాష్‌రూమ్ వెళ్లడానికి కూడా అనుమతించకపోగా, తోటి విద్యార్థుల ముందు దుర్భాషలాడిందని స్టూడెంట్స్ తెలిపారు. టీచర్ వేధింపులతో మనస్థాపానికి గురైన విద్యార్థిని ఆత్మహత్యా యత్నం చేసిందని ఆరోపించారు.
విషయం తెలుకున్న విద్యార్థులు తమ కూతురుని ఇబ్బందులకు గురిచేసిన ఇంగ్లిష్ టీచర్‌పై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. పిల్లల పట్ల దురుసుగా వ్యవహరించిన టీచర్‌పై చర్యలు తీసుకోకపోతే, కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. కాగా, ఈఘటనపై మండల విద్యాధికారి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.