కల్వకుర్తి రూరల్ : కల్వకుర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని కల్వకుర్తి ఆర్డీవో శ్రీను, కల్వకుర్తి తహసీల్దార్ ఇబ్రహీం పరిశీలించారు. పరీక్షా గదులను తనిఖీ చేశారు.
గదులలో వెంటిలేషన్, తాగు నీటి వసతి చక్కగా ఉండే విధంగా నిర్వాహకులు శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలను సెంటర్ సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు.