వెల్దండ ఏప్రిల్ 27: వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామం నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు తరలి వెళ్లారు. అంతకుముందు గ్రామంలో భారీ ర్యాలీ తీసిన కార్యకర్తలు బీఆర్ఎస్ జండాను ఎగురవేశారు. అనంతరం వాహనాల్లో వరంగల్ సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ పనుగోటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీ స్పందన వచ్చిందన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో సభ జరగనుందని తెలిపారు.
ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కానుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసగించిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాములు, నాయకులు దశరథం యాదవ్, అశోక్ గౌడ్, సురేష్, భూపతిరావు, శ్రీను, కృష్ణయ్య, సత్యం, సత్యనారాయణ, రామచంద్రయ్య తదితరులు ఉన్నారు.