పెద్దమందడి, మే 6 : తాము ఎ లాంటి తప్పు చేయకున్నా వేల కొద్దీ పెనాల్టీ లు వేశారంటూ విద్యుత్ అ ధికారులను గిరిజనులు ని ర్బంధించిన ఘటన మండలం లోని ముందరితండాలో చోటు చే సుకున్నది. ముందరితండాలోని చాలా మందికి విద్యుత్ అధికారులు వేలల్లో ఫైన్లు వేశారు. తాము తక్కువ వాడినా.. ఎలాంటి తప్పులు చేయకున్నా కేసులు పెట్టి, అధిక మొత్తంలో విద్యుత్ బిల్లులు వేశారని గిరిజనులు ఆరోపించారు. ఫైన్లు కట్టాల్సిందేనని అధికారులు పట్టుబట్టడంతో ఆగ్రహించారు. శుక్రవారం బకాయిలు వసూలు చేయడానికి వచ్చిన విద్యుత్ ఏఈ శ్రీకాంత్శర్మతోపాటు నలుగురు సిబ్బందిని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. ఉన్నతాధికారులు వచ్చే వరకు విడిచిపెట్టమ ని తండావాసులు జీపీ ఎదుటే కూర్చుకున్నారు.
ఒక్కొక్కరికీ రూ.40 వేల నుంచి రూ.80 వే ల వరకు బిల్లులు వేయడం సరికాదన్నారు. అక్రమంగా వేసిన బిల్లులను రద్దు చేస్తేనే అధికారులను విడిచిపెడుతామని, ఏడీ, డీఈ, ఎస్ఈ వచ్చి సమస్యలు పరిష్కరించాలని తెగేసి చెప్పారు. విషయం తెలుసుకున్న పెద్దమందడి ఎస్సై హరిప్రసాద్ తండాకు చేరుకొని రెండు, మూడ్రోజుల్లో సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పడంతో అధికారులను విడిచిపెట్టారు. ఈ విషయమై విద్యుత్ శాఖ ఏఈ శ్రీకాంత్శర్మను వివరణ కోరగా గతేడాది విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలో భాగంగా తండాలో 27 మందిపై కేసు నమోదైనట్లు, అందులో 18 మంది విద్యుత్‌ను అక్రమంగా వినియోగిస్తున్నారని చెప్పారు. పెనాల్టీ మొత్తం కట్టాల్సిందేనని ఆయన సూచించారు.