అచ్చంపేట రూరల్ : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దేశ్య నాయక్ అన్నారు. రైతు భరోసాను తక్షణమే అమలు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలోతాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి 16 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు హామీలు అమలువర్చకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకి రుణమాఫీ చేస్తామని చెప్పి కొంతమందికి మాత్రమే రుణమాఫీ అందించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.
వర్షాకాలం ప్రారంభం అయినప్పటికీ నేటికీ రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేవని మండిపడ్డారు. హమీలను నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్ధం సైదులు,నాయకులు శివకుమార్, బి రాములు, జి పర్వతాలు, తిరుపతయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సయ్యద్, రేనయ్య, పర్వతాలు, లక్ష్మణ్ సురేష్, రవి, వెంకటమ్మ, లక్ష్మి, రజిత, రవి నాయక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.