Kollapur | రాష్ట్రవ్యాప్తంగా మున్పిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు, అభ్యర్థులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రం ప్రచారం చేస్తున్నారు.
కొల్లాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓ కాంగ్రెస్ అభ్యర్థి భర్త పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భర్త సతీష్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను ప్రలోభపెడుతున్న దృశ్యాలు ఇప్పుడు ఆన్లైన్లో హల్ చల్ చేస్తున్నాయి.
కాంగ్రెస్ నాయకులు యధేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా అధికారులు, పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. కొల్లాపూర్ 1వ వార్డులో పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపల కాంగ్రెస్ నాయకులు ఓటర్ స్లిప్పుల వెనుక కాంగ్రెస్ పార్టీ గుర్తుతో కూడిన కరపత్రాన్ని ఓటర్లకు పంచుతూ ప్రచారం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ నాయకులు నిలదీశారు.
ఓ వైపు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం.. మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వివాదం జరుగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు, అధికారులు చోద్యం అందరినీ షాక్కు గురిచేస్తుంది. .
కొల్లాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి భర్త
ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భర్త సతీష్
కాంగ్రెస్ నాయకులు యదేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా పట్టించుకోని… pic.twitter.com/A0vptfNy2L
— Telugu Scribe (@TeluguScribe) February 11, 2026
కొత్తగూడెంలో ప్రశాంతంగా పోలింగ్.. ఓటు వేసిన కలెక్టర్
నల్లగొండలో ఓటేసిన ట్రాన్స్జెండర్లు
Chennuru | పోలింగ్ రోజూ మంత్రి వివేక్ ప్రచారం..! ఎన్నికల సంఘం తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు