ఆత్మకూర్: తెలంగాణ ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణకు చట్ట బాధ్యత కల్పించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్ యాదవ్ (Ravikumar Yadav) డిమాండ్ చేశారు. వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని గతవారం రోజులుగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆత్మకూరు గాంధీ చౌరస్తాలో చేపట్టిన వివాహార దీక్షలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. 30 ఏండ్లుగా ఏబీసీడీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తున్న పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టిన చట్టబద్ధత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్తం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏబీసీడీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని అంతవరకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల పరీక్షల ఫలితాలను నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలుస్తుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మాజీ చెన్నయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వీరేశలింగం, ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కోటేశ్వర్, కోఆప్షన్ సభ్యులు రియాజ్ ఆలీ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు అజపాగ లక్ష్మణ్, మాసన్న, మండల అధ్యక్షుడు కృష్ణ, గొరెల్లి రాము, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.