వెల్దండ మే 28: ఆలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలని మాజీ ఎంపీపీ పుట్టా రాంరెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు కానుగుల జోగయ్య అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో శ్రీ బీరప్ప స్వామి ఆలయానికి బీఆర్ఎస్ నాయకుడు కానుగుల జోగయ్య రూ. 25 వేలు విరాళంగా కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.
ఆలయానికి విరాళం ఇవ్వడం తనకు ఎంతో ఆనందంగా ఉందని జోగయ్య అన్నారు. ఈ సందర్భంగా జోగయ్యను ఆలయ కమిటీ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ నిరంజన్, బీఆర్ఎస్ నాయకులు చంద్రకుమార్, ఆనంద్, లింగం, ఏంఎస్ గౌడ్, వెంకట్, రవికుమార్, సాయిలు, ఆలయ కమిటీ సభ్యుడు రామకృష్ణ, కుమార్ తదితరులు ఉన్నారు.