అచ్చంపేట, డిసెంబర్ 27 : సీఎం కేసీఆర్ క్రీడారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, గ్రామీణ ప్రాంత క్రీడాకారులు కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మంగళవారం అ చ్చంపేటలో జీబీఆర్ ఆలిండియా క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సమావేశానికి ప్ర భుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తో కలిసి మంత్రి హాజరయ్యారు. ఆర్ఫాన్ సీసీ, గ్రీన్‌సిటీ లెవన్ జట్ల మధ్య కొనసాగిన ఫైనల్ మ్యాచ్‌ను తిలకించారు. ఆర్ఫాన్ సీ సీ జట్టు తరఫున విప్ గువ్వల ఆడారు. ఫై నల్ మ్యాచ్‌లో ఆర్ఫాన్ సీసీ జట్టు విజ యం సాధించింది. విజేత, రన్నరప్ జట్లకు మంత్రి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. సాదాసీదా క్రీడాకారుడిగా విప్ గువ్వల ఆడిన తీరు అభినందనీయమన్నారు. అచ్చంపేట స్టేడియం అభివృద్ధి కో సం రూ.1.50 కోట్లను కేటాయిస్తున్నటు ప్రకటించారు.
వారం రోజుల్లో పనులు ప్రా రంభించుకోవచ్చన్నారు. స్టేడియం ప్రహరీ వెడల్పు, మైదానాన్ని చదును చేయడం, డ్రెస్సింగ్ రూం, ఆటలను తిలకించేందుకు మెట్లు వంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం విప్ గువ్వల పట్టుబట్టి నిధులు తెచ్చుకుంటున్నట్లు చెప్పారు. చెన్నకేశవ, ఉ మామహేశ్వరం రిజర్వాయర్ల నిర్మాణానికి సీఎం కేసీఆర్ నిధులు విడుదల చేశారని, త్వరలోనే అచ్చంపేటలో పర్యటించి పను లు ప్రారంభిస్తామన్నారు. నిఖత్జరీనా వంటి క్రీడాకారులకు నివాస స్థలం, రూ. కోటి నిధులు అందించిన ఘనత సీఎం కే సీఆర్దే అని అన్నారు. అచ్చంపేటను టూ రిజంపరంగా ఎంతో అభివృద్ధి చేశామన్నా రు. విప్ గువ్వల నిక్కచ్ఛిగా, ముక్కుసూటి గా ఉంటారనేది అందరికీ తెలుసని.., కొం దరు గిట్టని వారు పనిచేసే వారిపైనే అసత్య ఆరోపణలు చేస్తుంటారని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం విప్ గువ్వల మాట్లాడుతూ స్టేడియం నిర్మాణానికి నిధులు విడుదల చేయడంతో మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఉప్పనుంతలకు చెందిన అంతర్జాతీయ అథ్లెటిక్ భా గ్యలక్ష్మీని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరారు.
అచ్చంపేట భూషిరంగయ్య మ నుమడు వంశీ క్రికెట్లో బాగా రాణిస్తున్నారని, ఆయనకు ప్రోత్సాహం అందించి దే శం తరఫున ఆడేలా చొరవ తీసుకోవాలని విన్నవించారు. అచ్చంపేటలో ఆరు అకాడమీలు ఏర్పాటు చేయాలని కోరారు. రూ. వంద కోట్లను అమ్ముడుపోయే వ్యక్తిని కా దని, అచ్చంపేట ప్రజల ఆత్మగౌరవాన్ని కా పాడిన వ్యక్తినని అన్నారు. సీఎం కేసీఆర్ స హకారంతో అభివృద్ధి కోసం రూ.200 కో ట్లు మంజూరు చేయించినట్లు చెప్పారు. కొందరు అభివృద్ధి నిరోధకులు చేసిన బట్టకాల్చి వేసే ధోరణి ఇంకా మర్చిపోవడం లేదన్నారు. కార్యక్రమంలో జీబీఆర్ ట్రస్ట్ చైర్పర్సన్ గువ్వల అమల, రైతుబంధు స మితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మా ర్కెట్ కమిటీ చైర్పర్సన్ అరుణ, మున్సిప ల్ చైర్మన్ నర్సింహగౌడ్, జెడ్పీటీసీ రాంబా బు, నాయకులు తులసీరాం, రాజేశ్వర్‌రె డ్డి, పర్వతాలు, గోపాల్‌నాయక్ ఉన్నారు.