బల్మూరు, అక్టోబర్ 8 : పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేసి పథకాలను అమలు చేస్తున్నారని సర్పంచ్ ప్రియాంకాగణేశ్ అన్నారు. శుక్రవారం మండలంలోని మంగళకుంటపల్లిలో మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. అలాగే జీనుకుంటలో సర్పంచ్ శ్రీను, ఎంపీటీసీ లక్ష్మీదేవమ్మ చీరెలు అందజేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కృష్ణ, జంగయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఉప్పునుంతల మండలంలో..
ఉప్పునుంతల, అక్టోబర్ 8 : మండలంలోని రాయిచేడ్, అయ్యవారిపల్లి, ఈరటోనిపల్లి, సూర్యతండాల్లో మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ప్రతాప్‌రెడ్డి, సర్పంచులు బాలింగం, బాలూనాయక్, నాయకులు ఎల్లయ్యయాదవ్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.
అమ్రాబాద్ మండలంలో..
అమ్రాబాద్, అక్టోబర్ 8 : మండలకేంద్రంలో శుక్రవా రం మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సం దర్భంగా పలువురు మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డలు సం తోషంగా పండుగ జరుపుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం బతుకమ్మ చీరెలు అందిస్తున్నదని తెలిపారు. కార్యక్రమం లో రేషన్ డీలర్లు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.