కొల్లాపూర్,అక్టోబర్ 8: దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం పట్టణంలోని కన్యాకాపరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్యసంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గామాత ధనలక్ష్మీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రూ. 20లక్షల నోట్ల కరెన్సీతో నిర్వాహకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆకుతోట శేషయ్య, ఆకుతోట రాజశేఖర్‌శెట్టి దంపతులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఆకుతోట సుదర్శన్‌శెట్టి పర్యవేక్షణలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. అలాగే వరిదేల శమీవృక్ష కమిటీ ఆధ్వర్యం లో పిల్లలపార్కులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరంలో రెండో రోజు శ్రీగాయత్రీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేయించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భజరంగ్‌దళ్ పురేందర్, మెంటే శివకృష్ణ, భానుప్రకాశ్, రమేశ్, సురేందర్సింగ్, యాదమ్మ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
రెండోరోజు కొనసాగిన పూజలు
మండలంలోని ముష్టిపల్లి గ్రా మంలో ముదిరాజ్ యూత్ ఆధ్వర్యంలో రెండోరోజు దుర్గామాత వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ముదిరాజ్ యూత్ అధ్యక్షుడు అనుపటి మల్లేశ్, అంజి, మహేందర్, తిరుపతి, వెంకట్, బాలపీరు తదితరులు ఉన్నారు.