కోస్గి, ఆగస్టు 16 : సీఎం కేసీఆర్ పిలుపుమేరకు దళితబంధు ప్రారంభోత్సవ సభకు టీఆర్ఎస్ నాయకులు హు జూరాబాద్‌కు తరలివెళ్లారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళితబంధు కార్యక్రమాన్ని సీఎం సోమవారం ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి మండలం నుంచి నాయకులు వెళ్లారు. దళితుల అభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమం పేదలకు చేయూతనిస్తున్నదన్నారు. త్వరలో రాష్టవ్యాప్తంగా మండలంలోని ప్రతి గ్రామంలో లబ్ధిదారులను ఎంపిక చేసి పథకం వర్తింపజేస్తారన్నారు. కార్యక్రమం లో గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రామకృష్ణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వరప్రసాద్, కౌన్సిలర్ శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మరికల్ మండలంలో…
మరికల్, ఆగస్టు 16 : సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం నూతనంగా చేపట్టిన దళితబంధు పథకం ప్రారంభానికి మండలానికి చెందిన నా యకులు హుజూరాబాద్‌కు తరలివెళ్లారు. ఈ సందర్భం గా నాయకులు మాట్లాడు తూ దళితుల అభివృద్ధికి సీ ఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రవికుమార్, ఉపసర్పంచ్ శివకుమార్, నాయకులు రాజవర్ధన్‌రెడ్డి, హన్మిరెడ్డి, రామస్వామి, నర్సింహులు, సవరన్న, శ్రీనివాసులు, మతీన్, బాలకృష్ణ తదితరు లు పాల్గొన్నారు.
బహిరంగసభకు…
నారాయణపేట, ఆగస్టు 16 : హుజూరాబాద్‌లో నిర్వహించిన దళితబంధు బహిరంగసభకు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి నాయకులు వివిధ వాహనాల్లో తరలివెళ్లారు. నియోజకవర్గంలోని మరికల్, నారాయణపేటతోపాటు కోస్గి మండలం నుంచి బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో నాయకులు, కార్యకర్తలు, దళిత నేతలు బయలుదేరారు. ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు బుల్లెట్రా జు, నారాయణ తరలివెళ్లారు.
దేశం గర్వించదగిన సీఎం కేసీఆర్
నారాయణపేట టౌన్, ఆగస్టు 16 : దేశం గర్వించదగిన సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్ దళిత నాయకురాలు, పట్టణ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు తిరుపతమ్మ, నాయకు డు రవికిరణ్ అన్నారు. దళితబంధు ప్రారంభోత్సవం సందర్భంగా పట్టణంలోని సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషే కం చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అంతకుముందు గజలమ్మ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం వారు మా ట్లాడుతూ దళితబంధు పథకం ద్వారా దళితులను ఆదుకోవడం హర్షించదగిన విషయమన్నారు.దళితబంధు పథకం ప్రారంభోత్సవ సభకు మండలంలోని ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ దళిత నాయకులు, కా ర్యకర్తలు పెద్దఎత్తున తరలివెళ్లారు. మండలకేంద్రం నుంచి ప్రత్యేక వాహనాల్లో వెళ్లి సీఎం సభలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రవీణ్‌కుమార్, గజలమ్మ, ఉమాదేవి, స్వప్న, భీ మమ్మ, సునీత, భారతమ్మ, సాయమ్మ పాల్గొన్నారు.