కల్వకుర్తి రూరల్ : హైదరాబాదులోని జింఖానా గ్రౌండ్లో జరిగిన 11వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ( Athletics ) పోటీలలో నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన క్రీడాకారులు తమ సత్తాను చాటి పతకాలను సాధించారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ స్వాములు ఆధ్వర్యంలో 25 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొన్నారు.
వారిలో అభినవ్ రెడ్డి , శివరామకృష్ణ , చైతన్య , కిరణ్ ఆయా క్రీడాంశాల్లో ఐదు పథకాలు సాధించినట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ స్వాములు తెలిపారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన క్రీడాకారులను అంతర్జాతీయ క్రీడాకారిని లావణ్య రెడ్డి, సీనియర్ క్రీడాకారుడు గోకమల్ల రాజు అభినందించారు. లావణ్య రెడ్డి మాట్లాడుతూ నిత్యం క్రీడా సాధన చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తాను చాటాలని కోరారు.