Nagarkurnool | నాగర్కర్నూల్ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు అందించాలని తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండి, వీపీ గౌతమ్.. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలను ఆదేశించారు.
ఈ క్రమంలో నాగర్కర్నూల్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాలు, వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ సంతోష్.. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతి, ఇందిరమ్మ ఇండ్ల రెండో దశలో ఎంపిక చేయనున్న లబ్దిదారుల వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా నాగర్కర్నూల్ మండలం గగ్గలపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు.