నాగర్‌కర్నూల్, మే 11 : నాగర్‌కర్నూల్ జిల్లా కేం ద్రం గులాబీమయమైంది. శనివారం పట్టణంలో బీఆర్ఎస్ నిర్వహించిన రోడ్‌షో అట్టహాసంగా సాగింది. పా ర్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు కావడంతో కొల్లాపూర్ చౌరస్తా నుంచి ఉయ్యాలవాడ వరకు భా రీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. జై బీఆర్ఎస్.. జైజై కేసీఆర్ అన్న నినాదాలు మార్మోగాయి. మాజీ ఎమ్మెల్యే మ ర్రి జనార్దన్‌రెడ్డి, ముఖ్య నాయకులు నాగం శశిధర్‌రెడ్డి, అభిలాశ్రావుతో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ ప్రచార రథంపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు.
పదేండ్ల అభివృద్ధిని చూసి ఆదరించాలి : ఆర్ఎస్పీ
కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి బీఆర్ఎస్ను ఆదరించాలని నాగర్‌కర్నూ ల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. కాంగ్రెస్, బీజేపీ పా ర్టీల మాయమాటలు నమ్మితే మరోసారి గోస తప్పదని హెచ్చరించారు. రేవంత్ సర్కారు ఆరు గ్యారెంటీల పే రుతో గారడీ చేసి ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అమలుకు సా ధ్యంకాని హామీలు గుప్పించి గద్దెనెక్కిన తర్వాత ప్రజ లు, రైతులను విస్మరించిందని దుయ్యబట్టారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్కటీ సక్రమంగా అమలు కా వడం లేదన్నారు. ముఖ్యంగా రైతులకు రుణమాఫీ ఊసెత్తడం లేదని, రైతుబంధు అంతంత మాత్రంగానే జమైందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా రూ. లక్ష సాయంతోపాటు తులం బంగారం ఎక్కడ అని ప్ర శ్నించారు.
మీరిచ్చిన హామీల్లో ఒక్కటైనా ప్రజలకు అం దిందా అని నిలదీశారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకులను ఎక్కడికక్కడే నిలదీయాలని సూచించారు. మర్రి జనార్దన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నాగర్‌కర్నూల్‌ను సుందరంగా తీర్చిదిద్దారని, ఇప్పుడేమో కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించి తప్పుచేశామని ప్రజలే బాధపడుతున్నారని తెలిపారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మర్రితో కలిసి ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటువేయవ్దన్నారు. వనపర్తి, గద్వాల జిల్లాలను రద్దు చేయాలని ప్రభుత్వం చేస్తున్న కుట్రను ఖండించారు. జిల్లాలను రద్దు చేస్తే ప్రజలతో కలిసి ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లను తొలగిస్తుందన్నారు. సమావేశంలో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్చార్జి అభిలాశ్‌రావు, ముఖ్య నాయకులు నాగం శశిధర్‌రెడ్డితోపాటు పలువురు పాల్గొన్నారు.
మోసగించే పార్టీ.. కాంగ్రెస్
దొంగ హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌కు.. ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ ఎంపీ అ భ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. శనివారం మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డితో క లిసి కొల్లాపూర్‌లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సింగోటం చౌరస్తా నుంచి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగగా దారి పొడవునా జై కేసీఆర్.. జై బీరం.. జై ఆర్ఎస్పీ నినాదాలతో హోరెత్తింది. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ మాట్లాడుతూ త ప్పుడు పద్ధతిలో మంత్రి జూపల్లి గ్రామాల్లో తన శా ఖ తరఫున మద్యం బాటిళ్లు దింపారని.. బీరు బాటిళ్లతో పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆరోపించారు. తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ వి ద్యావంతుడైన ప్రవీణ్‌కుమార్‌ను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదన్నారు. రైతుల రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా హామీలను కాంగ్రెస్ గాలికొదిలేసిందన్నారు. అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రంగినేని అభిలాష్‌రావు మాట్లాడారు. ర్యాలీలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి : మర్రి
ఎన్నికల సమయంలో గ్యారెంటీల పేరుతో ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాక కాంగ్రె స్ సర్కారు చేసిన నిర్వాకంతో జనం, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో మోసకారి కాంగ్రెస్‌తోపాటు మతాల మధ్య చిచ్చుపెట్టే బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి కో రారు. రేవంత్ మాటలకు మరోసారి మోసపోవద్దని, బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. కేసీఆర్ చేసిన మంచి ప నులను చూసి మరోసారి తప్పటడుగు వేయకుండా కారుకు బ్రహ్మరథం పట్టాలని కోరారు.