Nagarkurnool | అచ్చంపేట, జూన్ 22 : కాంగ్రెస్ పార్టీలో ముస్లిం మైనార్టీలకు పార్టీ పదవులు ఇవ్వడం లేదని ఈసారైనా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని ముస్లిం మైనారిటీలకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు, ఐఎన్టియుసి తాలూకా అధ్యక్షులు మహబూబ్అలీ డిమాండ్ చేశారు.
ఆదివారం ఆయన మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని మైనార్టీలకు ఇవ్వాలని టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణలను కోరుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నతమైనటువంటి పదవులు ముస్లిం మైనార్టీలకు ఎక్కడ కూడా కేటాయించడం లేదు దయచేసి మా విన్నపాన్ని స్వీకరించి నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్ష పదవి ముస్లిం మైనారిటీలకు ఇవ్వాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేస్తున్నామని, రాష్ట్రస్థాయిలో కూడా ముస్లిం మైనారిటీలకు ఉన్నతమైనటువంటి పదవులు ఇవ్వాలని జిల్లా స్థాయిలో కూడా ముస్లిం మైనారిటీలకు ఉన్నతమైనటువంటి పార్టీ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
రాష్ట్ర పెద్దలందరూ ఆలోచన చేసి ముస్లిం మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీలో సముచిత న్యాయం చేకూర్చాలని అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని నిబద్ధతతో నిజాయితీతో కాంగ్రెస్ పార్టీకి అండగా ఎక్కువ శాతం ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని కాబట్టి ముస్లిం మైనార్టీలకు రాజకీయంగా ఉన్నత పదవుల్లో అవకాశం కల్పించాలని అన్నారు.