వెదురుతో వెరైటీలు
పర్యావరణానికి గొడ్డలిపెట్టు గా మారిన ప్లాస్టిక్ వస్తువు ల వాడకం తగ్గించాలని ప ర్యావరణ వేత్తలు సూచిస్తున్నప్పటికీ సమాజంలో మార్పు రావడంలేదు. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ బదు లు వెదురుతో ఎన్నో ఉపకరణాలు, బొమ్మలు త యారీచేసి వినియోగించుకోవచ్చని పెబ్బేరుకు చెం దిన హెచ్ఎం మురళీకృష్ణ నిరూపించాడు.
- ఆకట్టుకుంటున్న వివిధ రకాల కళాకృతులు
- పర్యావరణ రక్షణగా ప్రయోగాలు
- ప్లాస్టిక్కన్నా వెదురే మిన్న అంటున్న పెబ్బేరు ప్రభుత్వ ఉపాధ్యాయుడు మురళీకృష్ణ
- రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు
- పలువురిచే అభినందనలు
పెబ్బేరు, ఏప్రిల్ 8 : పర్యావరణానికి గొడ్డలిపెట్టు గా మారిన ప్లాస్టిక్ వస్తువు ల వాడకం తగ్గించాలని ప ర్యావరణ వేత్తలు సూచిస్తున్నప్పటికీ సమాజంలో మార్పు రావడంలేదు. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ బదు లు వెదురుతో ఎన్నో ఉపకరణాలు, బొమ్మలు త యారీచేసి వినియోగించుకోవచ్చని పెబ్బేరుకు చెం దిన హెచ్ఎం మురళీకృష్ణ నిరూపించాడు. వెదురు తో ఉన్న అనుబంధం వల్ల ఎన్నో ప్రయోగాలు చేసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
కొత్తకోట మండలం రామకృష్ణాపురం ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్న మురళీకృష్ణ.. వెదురుతో రకరకాల వస్తువులు తయారుచేశాడు. ఆయన నైపుణ్యాన్ని ఎన్నో సంస్థలు అభినందించా యి. వెదురుతో వస్తువులను తయారుచేయడమే కా కుండా.. వెదురు ప్రాధాన్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పేందుకు పలు వైజ్ఞానిక ప్రదర్శనలకు హాజరవుతూ అవగాహన కల్పిస్తున్నారు. బొంగులతో ఇ ల్లు, బస్సు, బావి, విమానం, రథం, బతుకమ్మ, దూరదర్శన్, పూలకుండితో పాటు విద్యార్థుల బో ధనకు ఉపయోగపడే వాటిని రూపొందించాడు. ఆ దరణ లభిస్తే నిత్యం ఉపయోగించే ప్రతి వస్తువును వెదురుతో తయారు చేసుకోవచ్చని అంటున్నాడు.
మురళీకృష్ణ పాల్గొన్న సదస్సులు..
- ఎన్సీఆర్టీ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ వెబినార్లో వెదురు బోధన ఉపకరణాల ద్వారా విద్యాబోధన అనే అంశంపై నిర్వహించిన ప్రదర్శనకు ప్రశంసలు.
- ఢిల్లీలో జరిగిన జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థలు నిర్వహించిన జాతీయ సదస్సులో ప్రశంసలు.
- కేరళలో జరిగిన దక్షిణ భారతదేశ సైన్స్ఫెయిర్లో వెదురు ఆకృతులు.. ఉత్తమ పర్యావరణ ప్రదర్శనగా ఎంపిక.
- హైదరాబాద్లో ఎన్ఐఆర్టీ, పీఆర్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సదస్సులో వెదురు రంగంలో నూతన ఆవిష్కరణల ప్రదర్శన.
- హైదరాబాద్లో ఎన్సీఆర్టీ ఆధ్వర్యంలో జరిగిన సైన్స్ దినోత్సవ సెమినార్లో ప్రశంసలు.
- నిర్మల్లో జరిగిన రాష్ట్ర స్థాయి సైన్స్ఫెయిర్లో ఐదో స్థానం.
- వనపర్తిలో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ఫెయిర్లో ప్రథమ స్థానం.
- జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు.
మానవాళి ప్రగతికి దోహదం..
మానవాళి ప్రగతికి వెదురు ఎంతో దోహదం చేస్తుంది. ఈ విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించి ప్రోత్సహించాలి. ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనకు అందరూ కృషి చేయాలి. పర్యావరణానికి హాని చేయని వెదురు, మట్టి వస్తువుల వినియోగంపై అవగాహన కల్పించాలి. సుస్థిరాభివృద్ధి సాధించేందుకు స్థానికంగా తయారైన బొమ్మలతో ఓకల్ ఫర్ లోకల్ నినాదాన్ని అమలుచేయాలి. నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం విద్యార్థులకు ఉపకరణాలతో కూడిన బోధనలో వెదురుకు ప్రాధాన్యమివ్వాలి.
– మురళీకృష్ణ, హెచ్ఎం
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

