జడ్చర్ల, డిసెంబర్ 16 : జడ్చర్ల పోలీస్ స్టేషన్ను సోమవారం మల్టీజోన్-2 ఐజీ సత్యనాయణ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది వివరాలు సీఐ ఆదిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలు తీర్చడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. ప్రజలతో మర్యాద పూర్వకంగా మాట్లాడాలని, ఫిర్యాదు దారులందరికీ ఒకే రకమైన సేవలు అందించాలని సూచించారు.
అధికారు లు, సిబ్బంది ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకొని శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూసుకోవాల ని సూచించారు. జడ్చర్ల పోలీస్స్టేషన్లో అధికంగా కేసు లు నమోదవుతున్నాయని, కావున సిబ్బంది ఆస్తి సంబంధిత నేరాలు, శారీరక నేరాల్లో పాల్గొన్న నేరస్తులపై హిస్టరీ షీట్స్ తెరిచి వారిపై నిఘా ఉంచాలని సూచించారు. జ డ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు జాతీయ రహదారులు ఎన్హెచ్ 44, ఎన్హెచ్ 167 ఉన్నందునా ప్రమాదాల ని వారణకు కృషి చేయాలన్నారు. విధులతోపాటు ఆ రోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ జానకి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, జడ్చర్ల టౌన్ సీఐ ఆదిరెడ్డి తదితరులు ఉన్నారు.