SLBC Tunnel Mishap | మహబూబ్ నగర్: ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో కొనసాగుతున్న సహాయక చర్యల్లో పురోగతి కనిపిస్తోంది. రంగంలో దిగిన భారత సైన్యం ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీం పాలు పంచుకుంటున్నాయి. వెయ్యి హార్స్ పవర్ మోటార్లతో నీటిని తోడుతున్నారు. బురదతో కూడిన నీరు భారీ ఎత్తున బయటకు పంపిస్తున్నారు. నీటి ఉధృతికి లోకో ట్రైన్ పట్టాలు సైతం మునిగిపోయాయి. అయినప్పటికీ రెస్క్యూ బృందం శిథిలాల తొలగింపులో వేగం పెంచారు. సంఘటన స్థలంలో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నరు.
ఎన్డీఆర్ఎఫ్, సైనిక బృందాలతో కలిసి సొరంగంలోకి తీసుకువెళ్లిన సామాగ్రితో కూలిన ప్రాంతంలో మెటీరియల్.. సిమెంట్ కాంక్రీట్‌ను కట్ చేసి తొలగిస్తున్నారు. నీరు పెద్ద మొత్తంలో వస్తుండడంతో ఆ నీటిని ఒక పక్కకు జరుపుతూ రెస్క్యూ బృందాలు ముందుకు వెళుతున్నాయి. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగ మార్గంలో పైకప్పు కూలిన ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని రెస్క్యూ ఆపరేషన్ లో పురోగతి వచ్చిందని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కార్మికులు టన్నెల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, సైనిక బృందాలు లోపలికి వెళ్లాయని సహాయక చర్యల్లో పురోగతి మొదలైందని చెప్పారు.సొరంగం లోపలికి ఆక్సిజన్ పంపుతున్నామని, వాటర్ తోడేసే పనులు నిరంతరం సాగుతున్నాయని వెల్లడించారు.
రెస్క్యూ టీమ్ లకు కూలిన మట్టి, నీరు చేరడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని, వాటిని తొలగించే పనిలో సహాయక బృందాలు శ్రమిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే టన్నెల్ బోర్ మిషన్ (TBM) వరకూ సహాయక బృందాలు చేరుకున్నాయని, కార్మికులను రక్షిస్తామని అధికార యంత్రాంగం ధీమా వ్యక్తం చేసింది.
Group-2 Mains | ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం
Gurukul Entrance Test | హాల్ టికెట్ ఉన్నా.. గురుకుల పరీక్ష రాసేందుకు అనుమతి నిరాకరణ
Woman Suicide | ఏడాది క్రితం ప్రేమ వివాహం.. రామంతపూర్‌లో గృహిణి ఆత్మహత్య