అయ్యో పాపం..
కుటుంబ కలహాలతో మనోధైర్యం కోల్పోయిన తల్లి కుమారుడితో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలోని గోవర్ధనగిరిలో శుక్రవారం చోటు చేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. గోవర్ధనగిరికి చెందిన మంగలి శశికళ (34)కు పెబ్బేర్ మండలం షాగాపూర్ గ్రామానికి చెందిన చందుతో 17 ఏండ్ల కిందట వివాహమైనది. వారికి ఇద్దరు పిల్లలు.
కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్య
వీపనగండ్ల మండలం గోవర్ధనగిరిలో ఘటన
కుటుంబ కలహాలే కారణం
వీపనగండ్ల, జూలై 8 : కుటుంబ కలహాలతో మనోధైర్యం కోల్పోయిన తల్లి కుమారుడితో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలోని గోవర్ధనగిరిలో శుక్రవారం చోటు చేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. గోవర్ధనగిరికి చెందిన మంగలి శశికళ (34)కు పెబ్బేర్ మండలం షాగాపూర్ గ్రామానికి చెందిన చందుతో 17 ఏండ్ల కిందట వివాహమైనది. వారికి ఇద్దరు పిల్లలు. కుటుంబ కలహాలతో విసుగు చెందిన శశికళ పదేండ్లుగా పుట్టింట్లోనే ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నది. భర్త ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్లేవాడు.
కాగా, రెండు వారాల కిందట చందు గోవర్ధనగిరికి వచ్చి అక్కడే ఉన్నాడు. అయితే, బుధవారం రాత్రి కుమారుడు అఖిల్(7)తో కలిసి శశికళ ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. ఆమె ఆచూకీ కోసం కుటంబసభ్యులు వెతికి.. గరువారం సాయంత్రం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం గోవర్ధనగిరి సమీపంలోని ఓ రైతు వ్యవసాయ బావిలో తల్లీకొడుకుల మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శశికళ చీర కొంగుకు కుమారుడిని కట్టుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటనను చూసి ‘అయ్యో పాపం’ అంటూ స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా దవాఖానకు తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామన్గౌడ్ తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
- Tags
- commit
- Mahbubnagar
- Mother
- Son
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

