హన్వాడ, సెప్టెంబర్ 18 : మండలంలోని షేక్పల్లికి చెందిన మొగులయ్య, నర్సమ్మ (40) దంపతులు. కొన్ని నెలల కిందట వీరి కూతురు అంజలికి కొత్తపేటకు చెందిన వ్యక్తి తో వివాహం జరిపించారు. అయితే అత్తగారి ఇంటి నుంచి ఈనెల 16వ తేదీన సాయం త్రం 5 గంటలకు వెళ్లిపోయింది. రెండ్రోజులుగా బంధువులు, తెలిసిన వారి ఇండ్ల వద్ద వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు.
దీంతో వా రి కుటుంబ సభ్యులు బుధవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు. ఆచూకీ లభిస్తే 8712659339 నెంబ ర్ను సంప్రదించాలని సూచించారు. కాగా క న్నబిడ్డ కనిపించకుండా పోయిన విషయం తె లుసుకొన్న తల్లి నర్స మ్మ మనస్తాపంతో 17 న సాయంత్రం షేక్పల్లి సమీపంలోని వ్యవసా య పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహ త్య చేసుకున్నది. ఆమె భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.