కల్వకుర్తి రూరల్, జనవరి 8 : హైదరాబాద్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకూతళ్లు మృతి చెందిన ఘటన బుధవారం తిమ్మరాశిపల్లిలో చోటు చేసుకున్నది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మరాశిపల్లికి చెందిన గోపాల్, లక్ష్మమ్మ కూతు రు విజయ కల్వకుర్తి పట్టణంలో చదువుకుంటున్నది.
ఇటీవల విజయ అస్వస్థతకు గురికావడంతో వైద్యులను సంప్రదించగా రక్తకణాలు తక్కువగా ఉన్నాయని, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో బుధవారం ఉదయం గోపాల్, లక్ష్మమ్మ, విజయ బైక్‌పై హైదరాబాద్‌కు బయలుదేరారు. హైదరాబాద్‌లోని పహడిషరీఫ్ వద్ద బైక్‌ను డీసీఎం ఢీకొట్టడంతో లక్ష్మమ్మ, విజయ అక్కడికక్కడే మృతిచెందగా, గోపాల్‌కు కాలు విరిగింది. తల్లీకూతుళ్ల మృతితో గ్రామంలో పూర్తిగా విషాదఛాయలు అలుముకున్నాయి.