మద్దూర్ (కొత్తపల్లి), సెప్టెంబర్ 1 : భారీ వర్షానికి ఇల్లు కూలడంతో తల్లీకూతుళ్లు మృతి చెందిన ఘటన కొత్తపల్లి మండలం ఎక్కమేడ్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మే రకు.. ఎక్కమేడ్కు చెందిన హన్మమ్మకు ముగ్గురు కూతుళ్లు, ఓ కు మారుడు ఉన్నారు. భర్త ఇటీవల చనిపోవడంతో రెండో కూతు రు అంజిలమ్మతో కలిసి గ్రామంలోనే ఉంటున్నది.
కుమారుడు, కోడలు మరో ఇంట్లో ఉంటున్నారు. అయితే, వ ర్షాల కారణంగా ఇల్లు కూలడంతో హన్మమ్మ(60), ఆ మె కూతురు అంజమ్మ(40) మృతి చెందారు. వి షయం తెలుసుకున్న తాసీల్దార్ అనిల్‌కుమార్ ఘ టనా స్థలాన్ని పరిశీలించారు. సీఐ దాసునాయక్, ఎస్సై రాంలాల్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కొ డుకు అంజిలప్ప ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసినట్లు పోలీసులు తెలిపారు.