టోల్ ప్లాజా దోపిడీని అరికట్టాలి
మండలంలోని మున్ననూర్ గ్రామ సమీపంలో ఉన్న టోల్‌ప్లాజా వద్ద వాహనదారులు, వివిధ పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు.
- వారం రోజులుగా ఇండ్ల వద్ద ఉన్న వాహనాలకు టోల్ వసూలు
- ఫాస్ట్‌ట్యాగ్ ఖాతా నుంచి డబ్బులు మాయం
- హైవే-167పై వాహనదారుల ఆందోళన
మిడ్జిల్, డిసెంబర్ 24 : మండలంలోని మున్ననూర్ గ్రామ సమీపంలో ఉన్న టోల్‌ప్లాజా వద్ద వాహనదారులు, వివిధ పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో శనివారం ఉదయం జాతీయ రహదారి-167పై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. టోల్‌ప్లాజా నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొన్ని రోజులుగా వాహనాలు ఇంట్లోనే ఉన్నా టోల్‌ప్లాజా వద్ద డబ్బులు కట్ అవుతున్న మెసేజ్‌లు వస్తున్నాయని తెలిపారు. శుక్ర, శనివారం రెండ్రోజుల్లోనే సూమారు 30 నుంచి 40 వాహనాలకు డబ్బులు కట్ అయినట్లు వాహనదారులు వాపోయారు.
టోల్‌ప్లాజా నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఇలా జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన నిర్వాహకులు టెక్నికల్ సమస్యతో కొన్ని వాహనాల పేరుపై డబ్బులు కట్ అయ్యాయని తెలిపారు. ఎవరి డబ్బులు వారికి తిరిగి ఇస్తామని వారు నచ్చజెప్పారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై రాంలాల్‌నాయక్ ఇరువర్గాలతో మాట్లాడారు. టెక్నికల్ సమస్య తీరిన తర్వాత టోల్ డబ్బులు తీసుకోవాలని సూచించారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎస్సై చెప్పడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో వాహనదారులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

