గద్వాల, మే 2 : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బతు కు బండిపై వాణిజ్య సిలిండర్ గ్యాస్ ధరలు పెంచి చిరు వ్యాపారుల గుండెల్లో మంటలు రేపింది. మోదీ ప్రభు త్వం చెప్పేది ఒకటి చేసేది ఒకలా ఉండడంతో కేంద్ర ప్రభుత్వ తీరుపై చిరు వ్యాపారులు గుర్రుగా ఉన్నారు. వాణిజ్య సిలిండర్లు వినియోగించే వారిపై ఒకేసారి పెద్ద మొత్తంలో ధరలు పెంచడంతో హోటళ్లు నిర్వహించే వారు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారు ధరలు పెంచడంతో అది సామాన్యులపై పెనుభారం పడనున్నది. గ్యాస్ ధరలు పెంచబోమని ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించారు. అయితే శుక్రవారం 19కేజీల వాణిజ్య సిలిండర్ ధరపై రూ.993 పెంచడంతో ఇది అన్ని వర్గాల ప్రజలపై భారం పడడంతో ప్రధాని మోదీపై ప్రజలు మండిపడుతున్నారు. ప్రజలపై మోదీ భారం మోపుతున్నా ప్రతిపక్షాలు కూడా పట్టించుకునే స్థితిలో లేకుండా పోయా యి.
ప్రస్తుతం పెరిగిన ధరలు చిన్న, పెద్ద హోటళ్లు, వసతి గృహాలు నిర్వహిస్తున్న వారికి గుదిబండగా మారాయి. ధరలు నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం యు ద్ధం కారణంగా ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడు ఏమి కొని, తినలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు గ్యాస్ బండ పెంపు వాణిజ్య వినియోగదారులకు పుండు మీద కారం చల్లినట్లు అయ్యింది. ఇప్పటికే యుద్ధం పేరుతో గృహ వినియోగదారులకు సంబంధించి 14.5కేజీల సిలిండర్‌పై కేంద్రం రూ.60పెంచి వారిపై భా రం మోపింది. ఇప్పుడు వాణిజ్య సిలిండర్లపై ఒకేసారి పె నుభారం మోపడంతో వాణిజ్య, గృహ వినియోగదారులు కట్టెల పొయ్యి వైపు మరలుతున్నారు. ఇప్పటికే గ్యాస్ కొరత కారణంగా చాలా హోటళ్లలో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు. ప్రస్తుత భారం వారిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టినట్లు అయ్యింది.
వాణిజ్య సిలిండర్ల ధరలను కేంద్ర ప్రభుత్వం నాలుగు నెలల్లో నాలుగు సార్లు పెంచింది. మార్చి 1వ తేదీన రూ. 28 పెంచగా, మార్చి 7న 114 పెంచింది. ఏప్రిల్‌లో రూ. 196 పెంచగా మే1న రూ.993 పెంచింది. దీంతో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరలను కేంద్రం నాలుగు నెల ల్లో రూ.1498కి పెంచినట్లు అయ్యింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో 11 ఏజెన్సీలు ఉండగా వాటిలో 903 వాణిజ్య సిలిండర్లు, 1,76,366 గృహ వినియోగదారులకు సంబంధించి కనెక్షన్లు ఉన్నాయి. ధరలు పెంచడం వల్ల ప్రతి నెలా వాణిజ్య సిలిండర్లు వాడే వారిపై జిల్లావ్యాప్తంగా రూ.8,96,679 అదనపుభారం పడుతుండడంతో వారికి ఏమి చేయాలో తోచడం లేదు.
వాణిజ్య సిలిండర్ల ధరలు ఒకేసారి చమురు కంపెనీలు పెంచడం, కేంద్రప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ ప్రభావం చిన్న, చిన్న హోటళ్లు నడిపే వారిపై ప్రభావం చూపుతున్నది. అక్కడక్కడ టిఫిన్ సెంటర్లు, చాయ్ హోట ల్లు, చిన్న భోజనం హోటళ్లు నిర్వహించే వారిపై ఈ ప్రభా వం ఎక్కువగా పడుతుండడంతో వారి కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. తిరిగి వారు కట్టెల పొ య్యిపై మరలే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం స్పందించి వాణిజ్య సిలిండర్ల పెంపుధరలను నియంత్రించాలని వినియోగదారులు కోరుతున్నారు.
గ్యాస్ కొరత కారణంగా గిట్టుబాటు కావడం లేదు. గ్యాస్ కొరతతో చాలా ఇబ్బంది పడుతున్నాం. హోటల్ నిర్వహణ కష్టంగా మారింది. ఓ పక్క నిత్యావసర వస్తువుల ధర లు పెరగడం, గ్యాస్ సకాలం లో దొరక్కపోవడం భారంగా మారింది. ప్రత్యామ్నాయం చేసుకోలేకపోతు న్నాం. ప్రతి నెలకోసారి గ్యాస్ సరఫరా అయ్యేది కానీ ప్రస్తుతం రెండు నెలలైనా గ్యాస్ రావడం లేదు. కొరత కారణంగా ధరలను కూడా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వ్యాపారం బాగా తగ్గిపోతుందేమోనన్న భయం ఉంది.
– వరలక్ష్మి , హోటల్ నిర్వాహకురాలు, గద్వాల