టార్గెట్ 18 నెలలు.. పాత కలెక్టరేట్ స్థానంలో అధునాతన దవాఖాన
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో అధునాతన సూపర్ స్పెషాలి టీ దవాఖాన ఇప్పుడు ఉన్న కలెక్టరేట్ స్థానంలో నిర్మాణం కానున్న ది. కార్పొరేట్ స్థాయిలో దవాఖాన నిర్మించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రతిపాదించారు.
- రూ.300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన
- పాతకలెక్టరేట్ స్థానంలో కొత్తగా నిర్మాణం
- ఆధునిక హంగులతో కార్పొరేట్ స్థాయిలో
- మెడికల్ కాలేజీకి అనుబంధం
- 24 గంటలు ఉచిత సేవ..
- పట్నం వెళ్లకుండా ఇక్కడే అన్నిరకాల వైద్యసేవలు: ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
రూ.300 కోట్లు..954 బెడ్ల సామర్థ్యం.. సుమారు 16 ఎకరాల స్థలంలో.. ఆరు అంతస్తుల అధునాతన సూపర్ స్పెషాలిటీ దవాఖానకు పునాది రాయి పడనున్నది. పాలమూరు జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ స్థలంలో దవాఖాన నిర్మించనున్నారు. మహబూబ్‌నగర్ మెడికల్ కళాశాలకు అనుసంధానం చేస్తూ 24గంటలు ఉచితంగా వైద్య సేవలను అందించేందుకు చర్యలు తీసుకోనున్నారు. పట్నం వెళ్లకుండా జిల్లా కేంద్రంలోనే అన్ని రకాల వైద్యసేవలు అందేలా నిర్మాణం రూపుదిద్దుకోనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఈమేరకు సీఎం కేసీఆర్ ఈనెల 4న దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
మహబూబ్‌నగర్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో అధునాతన సూపర్ స్పెషాలి టీ దవాఖాన ఇప్పుడు ఉన్న కలెక్టరేట్ స్థానంలో నిర్మాణం కానున్న ది. కార్పొరేట్ స్థాయిలో దవాఖాన నిర్మించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రతిపాదించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.300 కోట్లు విడుదల చేసింది. ఈ బృహత్కార్యానికి ఈ నెల 4వ తేదీన సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. మెరుగైన వైద్య సేవలకు హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే అన్ని రకాల సేవలు పొందొచ్చు. వేల కోట్ల నిధులు వెచ్చించి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. త్వరలో కార్పొరేట్ వైద్యం అందనుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రూ.300 కోట్లతో ‘సూపర్’ దవాఖాన..
జిల్లా కేంద్రంలోని పాలకొండ వద్ద రూ.51 కోట్లతో నూతన సమీకృత కలెక్టరేట్ నిర్మించారు. దీనిని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో పాత కలెక్టరేట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటు కానున్నది. కాగా, మెడికల్ కళాశాల, అనుబంధ దవాఖాన కోసం జీవో ఎంఎస్ నంబర్ 95, 2015 ప్రకారం రూ.450 కోట్లు నిధులు విడుదలయ్యాయి. ఇందులో రూ.150 కోట్లతో ఎదిర గ్రామ పరిధిలో మెడికల్ కాలేజీని నిర్మించారు. అయితే ఇన్నాళ్లుగా వైద్యవిద్యార్థులు మహబూబ్‌నగర్ జిల్లా దవాఖానలోనే ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో మిగిలిన రూ.300 కోట్లతో ఆధునిక దవాఖాన నిర్మించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రతిపాదించారు. సివిల్ వర్కులకు రూ.250 కోట్లు, ఎక్విప్మెంట్ కోసం రూ.50 కోట్లు కేటాయించనున్నారు. దవాఖాన టెండర్‌ను బీపీఆర్ ఇన్ఫ్రాస్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కాంట్రాక్టును దక్కించుకున్నది. 18 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. అయితే, ఇప్పటికే పాత కలెక్టరేట్లోని భవనాను సంస్థకు అప్పగించారు. చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. దవాఖాన నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన వెంటనే పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టీఎస్ఎంఐడీసీ ఈఈ జైపాల్‌రెడ్డి తెలిపారు.
కనుమరుగుకానున్న పాత కలెక్టరేట్..
ఉమ్మడి జిల్లాలో ఓ వెలుగు వెలిగిన మహబూబ్‌నగర్ పాత కలెక్టరేట్ కనుమరుగు కానున్నది. నిజాం కాలం కంటే ముందే ఈ భవనాన్ని నిర్మించారు. ఈ భవనం ఎదుట టీడీపీ హయాంలో నిర్మించిన డీఆర్డీఏ భవనం కట్టారు.. కూల్చారు.. అయినా ఈ పాత కట్టడం రాజసం ఉట్టిపడేలా ఉన్నది. చిన్నచిన్న మరమ్మతులు చేశారు. ఇక్కడ ఎంతోమంది కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు ప్రజలకు సేవలందించారు. ఎంతోమంది ఇక్కడ పనిచేసి ఉన్నత పదవులు పొందారు. అలాంటి భవనం కొత్త కలెక్టరేట్ నిర్మించిన తరువాత కూల్చి.. దాని స్థలంలో ఆధునిక హంగులతో సూపర్ స్పెషాలిటీ దవాఖానను నిర్మిస్తున్నారు. ఈ భవనం భవిష్యత్‌లో ఎంతో మందికి ప్రాణదాతగా నిలవనున్నది.
పాలమూరులోనే ఆధునిక వైద్యం..
ఇక నుంచి చిన్న చిన్న రోగాలకు హైదరాబాద్ పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోనే నిరంతరం వైద్యసేవలందేలా సూపర్ స్పెషాలిటీ దవాఖానను నిర్మిస్తున్నాం. కొత్త కలెక్టరేట్ నిర్మించాక పాత భవనం నిరుపయోగంగా ఉం టుందని అందరూ భా వించారు. కానీ, పా త భవనాన్ని మ రిపించేలా దవాఖానను డిజైన్ చేశాం. ఆ రు అంతస్తుల్లో అన్ని రకాల వైద్య సే వలు అందేలా తీర్చిదిద్దుతున్నాం. సీ ఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన వెంటనే పనులు ప్రారంభిస్తాం.
– శ్రీనివాస్‌గౌడ్, పర్యాటక శాఖ మంత్రి
దవాఖాన నిర్మాణం ఇలా..
- 954 బెడ్ల సామర్థ్యంతో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తున్నది. పాత కలెక్టరేట్, దాని ఆవరణలోని 16.80 ఎకరాల్లో ఆరు అంతస్తులతో ఏర్పాటు కానున్నది. మెడికల్ కాలేజీకి అనుసంధానించనుండడంతో 24 గంటలపాటు వైద్యులు అందుబాటులో ఉండనున్నారు.
- గ్రౌండ్‌ఫ్లోర్‌లో క్యాజువాలిటీ బ్లాక్, లేబర్ బ్లాక్, ఇమేజింగ్ రేడియాలజీ, దవాఖాన డైట్ కిచెన్, ల్యాండ్రీ, ఓపీడీ జనరల్ సర్జరీ, మెడిసిన్ ఫెసిలిటీ ఉంటాయి.
- ఫస్ట్‌ఫ్లోర్‌లో పిల్లలకు సంబంధించి బెడ్లు, రూంలు, ఓబీజీ బెడ్స్, డిపార్ట్మెంట్, ఓబీజీ పేషెంట్ల బెడ్స్, దవాఖాన స్టోర్, సీఎస్ఎస్ఐడీ ఉంటాయి.
- సెకండ్ ఫ్లోర్లో జనరల్ సర్జరీ, పెషెంట్ బెడ్స్ డిపార్ట్మెంట్ రూంలు, ఆర్థ్దోపెడిక్, ఓపీడీ ఆర్థ్దోపెడిక్, ఫిజియోథెరపీ విభాగాలు ఉంటాయి.
- థర్డ్‌ఫ్లోర్‌లో జనరల్ మెడిసిన్, జనరల్ బెడ్స్, డిపార్ట్మెంట్ రూంలు, జనరల్ ల్యాబొరేటిస్, బ్లడ్ బ్యాంక్, ట్రాన్స్ఫ్యూజన్, మెడిసిన్ విభాగాలు ఉంటాయి.
- ఫోర్త్ఫ్లోర్లో ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, డిపార్ట్మెంట్లు, అనస్థీషియా, ఓటీ కాంప్లెక్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ అనస్థీషియా, ఐసీసీయూ, ఎస్ఐసీయూ, పీఐసీయూ, ఎన్ఐసీయూ, ఎంఆర్డీ, లెక్షర్గ్యాలరీ, ఓబీడీ హెచ్‌డీఏ, ఐసీయూ, ఆర్ఐసీయూ విభాగాలు ఉంటాయి.
- ఐదోఫ్లోర్లో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, బర్న్స్వార్డ్, టీబీ, సీడీలకు సంబంధించిన డిపార్ట్మెంట్లు, బెడ్స్ ఉంటాయి.
- గ్రౌండ్ ఫ్లోర్లో 88, ఫస్ట్‌ఫ్లోర్‌లో 180, సెకండ్‌ఫ్లోర్‌లో 250, థర్డ్‌ఫ్లోర్‌లో 190, ఫోర్త్ఫ్లోర్లో 148, ఐదోఫ్లోర్లో 98 బెడ్స్ కలిపి మొత్తం 954 బెడ్లు ఉంటాయి.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

