మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, నవంబర్ 11 : ఆయా కుటుంబాల ఆర్థిక అవసరాలను తీర్చే ఉద్దేశంతో వారు అమ్మాలనుకున్న బంగారాన్ని వారి ప్రాంతానికే వచ్చి కొనుగోలు చేసే సంచార వాహనాన్ని వాల్యూ గోల్డ్ సంస్థ ప్రారంభించింది. బంగారం అమ్మకానికి నాణ్యమైన సంస్థ వాల్యూ గోల్డ్‌గా ఆ సంస్థ ప్రతినిధులు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు బంగారం కొనుగోలు చేసేందుకు ఈ తరహా వాహనాన్ని ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారన్నారు. వాహనం ద్వారా బంగారానికి అక్కడికక్కడే స్వచ్ఛత పరీక్ష నిర్వహించడంతో పాటు అమ్మకం దారులు నష్టపోకుండా ధర నిర్ణయించి అందజేస్తామన్నారు. బంగారం కొనడంతోపాటు తనఖా పెట్టిన బం గారాన్ని విడిపించడం, బంగారు, వెండి నాణేల అమ్మకాలు చేస్తామన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో ప్రారంభించామని, ప్రస్తుతం 5 శాఖల ద్వారా హైదరాబాద్ ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. వినియోగదారులకు మెరుగైన మరిన్ని సేవలు అందించేందుకు వాల్యూ గోల్డ్ గ్రామాలకు విస్తరించేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. హైదరాబాద్‌తో పాటు ఇప్పటి వరకు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాలో సేవలు విస్తరించామని ఇప్పుడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నేటి నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు మొబైల్ గోల్డ్ వ్యాన్ ద్వారా సేవలు అందిస్తామని తెలిపారు.
మొబైల్ గోల్డ్ వ్యాన్ సేవలు ఈ నెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు లహరీ గార్డెన్స్, నాగర్‌కర్నూల్ జిల్లాలో అందుబాటులో ఉంటాయి. 17-20వ తేదీ వరకు దాచ లక్ష్మయ్య ఫంక్షన్‌హాల్ వనపర్తి జిల్లా, ఈ నెల 21-25 వరకు స్టార్ ఈవెంట్ హాల్ జోగుళాంబ గద్వాల జిల్లా, ఈ నెల 26-29 వరకు ఎస్ఆర్ గార్డెన్స్ పంక్షన్‌హాల్ నారాయణపేట జిల్లా, ఈ నెల 30వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు షాలీమార్ ఫంక్షన్‌హాల్, మహబూబ్‌నగర్‌లో ఈ వాహన సేవలు అందుబాటులో ఉంటాయి.