మహబూబ్‌నగర్, నవంబర్ 7 : పాలమూరు జిల్లాలో కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని, కాంగ్రెస్ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే తెలుసుకోవాలని ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి సూచించారు. గురువారం మహబూబ్‌నగర్ జైలులో ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సోదరుడు శ్రీకాంత్‌ను బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఇండ్ల విషయంలో తప్పుడు పత్రాలు శ్రీకాంత్‌గౌడ్ సృష్టించారని అంటున్నారు. కానీ తాసీల్దార్ రిపోర్టులో ఆ విషయం ఉందా? ఎవరో అనామకులు చెప్పారని ఆయనను అరెస్టు చేశారు. రేపు సీఎం రేవంత్‌రెడ్డి పేరు చెప్తే అలాగే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. మేమంతా ఉద్యమాల నుంచి వచ్చిన వారమని పేదల ప్లాట్లు అమ్ముకొనే నీచమైన స్థితిలో లేమన్నారు. అందులో దివ్యాంగుల వద్ద డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి శ్రీనివాస్‌గౌడ్ కుటుంబానికి లేద నే విషయం ప్రతిఒక్కరూ గుర్తించుకోవాలన్నారు.
ఇండ్ల పట్టాలు ఇచ్చిది మీరే, నల్లా, కరెంట్ కనెక్షను ఇచ్చింది కూడా అధికారులు కాదా అని గుర్తుచేశారు. అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు పోలీసు అధికారులు పనిచేస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే చట్టవ్యతిరేకంగా పనిచేసిన అధికారులపై చ ర్యలు ఉంటాయి. రూ.వేల కోట్ల నిధులు తీసుకొవచ్చి మహబూబ్‌నగర్ పట్టణాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభివృద్ధి చేసి జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చిన ఆయన కుటుంబాన్ని వేధిస్తున్నారని, రేపు మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అధికారులను హెచ్చరించారు. ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే పాలమూరు అభివృద్ధికి రూ.వంద కోట్లు అయినా మంజూరు చేయించారా? ఒక్క అభివృద్ధి పనినైనా ప్రారంభించారా అని ప్రశ్నించారు. వందల కోట్లు నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతుండడగా వాటిని పూర్తి చేయించే పరిస్థితి కూ డా లేదన్నారు.
కనీసం సర్పంచులకు బిల్లులు ఇవ్వలేని పరిస్థితితో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, మళ్లీ గ్రామపంచాయతీ నిధులు ఇవ్వకుండా మాజీ స ర్పంచులను అక్రమంగా అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రోదబలం తో పోలీసులు, అధికారులు బీఆర్ఎస్ నాయకుల పై తప్పులు కేసులు పెట్టడం, జైలుకు పంపడం వం టి చర్యలు చేపడుతున్నారని విమర్శించారు. అయి తే ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు కాంగ్రెస్‌ను సాగనంపుదామా అని ఎదురుచూస్తున్నారన్నారు. త్వరలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం రావ డం ఖాయం ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట తెలంగాణ మాజీ సర్పంచుల సంఘం నాయకులు సుర్వి యాదయ్య, ప్రణీల్‌చందర్, మాజీ సర్పంచులు వెంకట్, ప్రతాప్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.