నారాయణ పేట, నవంబర్ 29 : కాంగ్రెస్ పతనానికి దీక్షా దివస్ నాంది అని, ఇదే రోజునే లగచర్లలో రైతుల భూములు తీసుకోబోమని కాంగ్రెస్ ప్రభుత్వం వెనకి త గ్గినట్లు ప్రకటించిందని, ఇది బీఆర్ఎస్ పోరాటం వల్లే సా ధ్యమైందని నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మం కెన కోటిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కోటిరెడ్డి, అతిథులుగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు విఠల్‌రావుఆర్య హాజరయ్యారు. ముందుగా అమరవీరుల స్తూపానికి నివాళులర్పించడంతోపాటు జయశంకర్, తెలంగాణతల్లి చిత్రపటాలకు పూలాభిషేకం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
ఉద్యమంలో పాల్గొన్న వివిధ మండలాలకు చెందిన ఉద్యమకారులను సన్మానించారు. ఈ సందర్భంగా కోటిరెడ్డి మాట్లాడుతూ 15 ఏండ్ల కిందట నవంబర్ 29న కేసీఆర్ తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. కేంద్రం మెడలు వం చిన రోజునే మనం దీక్షాదివస్‌గా నిర్వహించుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ నాయకులు చెబుతున్నట్లుగా ఇది ఎవ రో భిక్ష ఇచ్చిన తెలంగాణ కాదని, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ అని.., అందుకే ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని గుర్తించి రెండు సార్లు అధికారం అప్పగించారన్నారు. ప దేండ్ల పాటు కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలో నెంబర్‌వన్‌గా నిలిపారన్నారు.
వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సాగునీరు, ఉచితకరెంట్, రైతుబంధు, రైతుబీమా, మద్దతు ధర కల్పించి రైతును రాజును చేసేందుకు కృషి చేశారన్నారు. అణగారిన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో వెయ్యికిపైగా గురుకులాలను ఏర్పాటు చేశారని వివరించారు. కానీ నేడు రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో నిత్యం ఏదో ఒక చోట గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురికావడంతోపాటు 48 మం ది విద్యార్థులను ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకున్నదన్నా రు. దీంతో ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు అంటేనే బెదిరిపోయే పరిస్థితి వచ్చిందని దు య్యబట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి తుంగలో తొక్కేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి వయసు, పదవికి తగ్గట్లు మాట్లాడం లేదని, ముందుగా ఆయన భాషను తీరును మార్చుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు దీక్షాదివస్ వేదిక కావాలన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించినందుకు అవాస్తవాలను జోడించి ప్రభుత్వం అన్యాయంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిందని విమర్శించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ అధ్యక్షుడు రామకృష్ణ, మైనార్టీ కార్పొరేషన్ సభ్యుడు సలీం, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, మక్తల్ మారెట్ కమిటీ మాజీ చైర్మన్ న ర్సింహారెడ్డి, మండలాల అధ్యక్షులు విజయ్‌సాగర్, రాము లు, కృష్ణయ్య, సుభాష్, నాయకులు సుదర్శన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సోనియాగాంధీ కాళ్లు కడిగి నెత్తిన పోసుకోవాలని సీ ఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని.., కానీ ఆయన కేసీఆర్ కా ళ్లు కడిగిన నీళ్లు పోసుకోవాలని, కేసీఆర్ తెలంగాణ సాధించకుంటే ఈ రోజు నీవు ముఖ్యమంత్రి అయ్యేవాడివి కా వని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి తెలిపారు. చావును సైతం లెక చేయకుండా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, విద్యార్థుల బలిదానాలు, కులమతాలకు అతీతంగా ప్రజలు ఉద్యమాలు చేస్తే గత్యంతరం లేని పరిస్థితుల్లో కేంద్రం రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిందన్నారు.
కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీ వల్లే తెలంగాణ వ చ్చిందని గొప్పలు చెప్పుకోవడం మానుకోవాలని, వందలాది మంది ఆత్మబలిదానాలకు సోనియాగాంధీయే కా రణం అన్నది గుర్తెరగాలన్నా రు. తెలంగాణ దేవత అని చె ప్పుకోవడానికి సిగ్గుండాలని, ఇదే రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు సోనియాను బలిదేవత గా అభివర్ణించారని, పదవి ఇ వ్వగానే తెలంగాణ తల్లి అ య్యిందా అని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకొ ని పరిపాలన చేస్తే మీకు, రాష్ట్రానికి గౌరవం దకుతుందని, అలా కాదని మూర్ఖంగా వ్యవహరిస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
కాంగ్రెస్ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చింద ని.., తీరా వాటిని అమలు చేయాలని కోరుతున్న ప్రజలు, ప్రతిపక్ష పార్టీల నాయకులపై దాడులు, అరెస్టు చేస్తూ తమ చేతగానితనాన్ని ప్రభుత్వం పదేపదే ప్రదర్శిస్తున్నదని మా జీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పాఠశాలల్లో పురుగుల అన్నం పెడుతున్నారని, మానవత్వంతో బియ్యం తెప్పించి దగ్గరుండి వండిం చి తినిపించడం నేరమా..? అందుకేనా తనను అరెస్టు చే సి పోలీస్స్టేషన్ల చుట్టూ తిప్పింది అని ప్రశ్నించారు.
అరెస్ట్ చేసినంత మాత్రాన భయపడేది లేదన్నారు. చివరికి విద్యార్థులదే తప్పు అన్నట్లుగా ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. పురుగుల అన్నం రావడానికి కుట్ర జరిగిందని ఆ రోపించడం సమంజసం కాదన్నారు. కేసీఆర్ తమకు ఎంతో క్రమశిక్షణ నేర్పించారని, ఎక డ ఆపద ఉంటే అకడ తాము ఉంటామన్నారు. కేసీఆర్ తె లంగాణ అభివృద్ధి కోసమే పరితపిస్తారని, ఆయనలా పరిపాలించకపోయినా ఫర్వాలేదు కానీ.. ఢిల్లీ పెద్దల ముందు తా కట్టు పెట్టి రాష్ట్ర పరువును దిగజార్చవద్దని సూచించారు. అరెస్టులు, కేసులకు భయపడొద్దని త్వరలో బీఆర్ఎస్ రా వడం ఖాయమని, అంతవరకు ఓపికపట్టాలని కోరారు.