నాగర్‌కర్నూల్, ఆగస్టు 11 : నిత్య జీవన విధానాల నుంచే పాటలు వస్తాయని, ప్రముఖ కవి, గాయకుడు, శాసన మండలి సభ్యుడు దేశపతి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ని సింగిల్‌విండో సమావేశపు హాల్లో నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక, తెలంగాణ భాషా సాం స్కృతిక శాఖ సంయుక్తంగా నిర్వహించిన సభకు క ల్వకోలు మద్దిలేటి అధ్యక్షత వహించారు. పాట నిర్మాణంపై జరిగిన వర్క్‌షాప్‌కి ముఖ్యఅతిథిగా దేశపతి శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. మానవత్వం, సామాజిక దృక్పథం, సిద్ధాంతాలు పాట లక్షణాలన్నారు. పల్లెల్లోనే ఎక్కువగా పాటలు వస్తాయని, ప్రజాయుద్ధనౌక గద్దరన్న పాటలు ఇందుకు ఉదాహరణ అన్నా రు.
పాలమూరు మట్టిబిడ్డ పురుశోత్తమని, పౌరహక్కులకు ప్రాణం పోసిన నేతంటూ వట్టికోట ఆళ్వారు స్వామి, గూడా అంజన్న, ప్రజా యుద్ధనౌక గద్దరన్న కు వందనాలు అంటూ అమరులపై ప్రజాగీతాలను ఆలపించారు. దాశరథి, గోరటి వెంకన్న, పాల్కూరి సోమన్న, పోతన, తెలంగాణ కవులు సుద్ధాల హ న్మంతు, మల్లావషుల సాదాశివుడు అనుసరించిన బా ణీలను, వారి కవిత్వాన్ని వివరించారు. విశిష్ట అతిథి గా హాజరైన డాక్టర్ పసునూరి రవీందర్ మాట్లాడు తూ.. జానపద బాణీలు తెలంగాణ సాయుధపోరా టం కారంచేడు, చుండూరు, పదిరికుప్పం, వేంపేట తెలంగాణ మలిదశ ఉద్యమం, ప్రజానాట్య మండలి, జననాట్యమండలి ఆయా కాలాల్లో వచ్చిన ఉద్యమాల్లోని కవులు, గాయకులు పాడిన పాటలను వివరించారు.
అమ్మకు పురిటి నొప్పులుంటే, నాన్నకు పు డమి నొప్పులని పాడిన పాటకు సభలో అందరూ కం టతడి పెట్టారు. అనంతరం దేశపతి శ్రీనివాస్, పసునూరి రవీందర్‌ను సన్మానించారు. కార్యక్రమంలో కళాకారులు రాములు, కాశన్న, జయప్రకాశ్, నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు వనప ట్ల సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి వహీద్‌ఖాన్, కందికొండ మోహన్, నీరటి బాలీశ్వర్, ఇద్రీస్, గౌస్‌పాషా, విజయకాంత్, దేవదానం, భూపాల్‌రెడ్డి, ప్ర భాకర్, గోపాల్, కృష్ణయ్య, ప్రశాంత్ పాల్గొన్నారు.