ఇటిక్యాల, జనవరి 4 : ప్రజాపాలన కార్యక్రమంలో అధికారులు ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజయుడు సూచించారు. మండలంలోని మునుగాల, చాగాపురం గ్రామాల్లో గురువారం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. మునుగాలలో దరఖాస్తుల ప్రక్రియను ఎమ్మెల్యే పరిశీలించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సందేహాలు ఉంటే ఓపికతో చెప్పి దరఖాస్తుల స్వీకరణ సజావుగా సాగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో తాసీల్దార్ వెంకటేశ్వర్లు, సర్పంచ్ విజయలక్ష్మి, జెడ్పీటీసీ హన్మంత్రెడ్డి, నాయకులు లక్ష్మీనారాయణరెడ్డి, నల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మానవపాడు, జనవరి 4 : ఆరు గ్యారెంటీల ప థకాలు పొందేందుకు అర్హులైన ప్రతిఒక్కరూ దరఖాస్తు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తాసీల్దార్ జుబేర్ మైనోద్దీన్కు ఎమ్మెల్యే విజయుడు సూచించారు. మండలంలోని పల్లెపాడు లో నిర్వహించిన ప్రజాపాలనలో దరఖాస్తులను ఎమ్మెల్యే స్వీకరించారు. పల్లెపాడులో 612, కొర్విపాడులో 676, చండూరులో 295 దరఖాస్తులు వచ్చాయని ఎంపీడీవో రమణారావు తెలిపారు.