ఇటిక్యాల, జనవరి 30 : కేసీఆర్ పాలనలోనే గ్రామాలాభివృద్ధి జరిగిందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తెలిపారు. మండలంలోని మునగాల లో ఉపాధిహామీ పథకం కింద రూ.20 లక్షలతో ని ర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి, రూ.5 లక్షలతో నిర్మిస్తున్న షాదీఖాన భవన నిర్మాణానికి మంగళ వారం భూమిపూజ చేశారు.
ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ పంచాయతీతోపాటు షాదీఖాన నిర్మాణానికి సర్పంచ్ కొప్పుల ల క్ష్మీనారాయణరెడ్డి స్థలం ఉచితంగా అందించడం అ భినందనీయమన్నారు. కార్యక్రమంలో సర్పంచు లు విజయలక్ష్మి, గోవర్ధన్‌రెడ్డి, సుంకన్న, ఈదన్న, నాయకులు శేఖర్‌రెడ్డి, శేఖర్‌గౌడ్, మహేశ్వర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.