అలంపూర్, మార్చి 8: అలంపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తానని స్థానిక ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శనివారం జోగులాంబ-గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గంలో బాధితుడికి ఎల్ఓసి ప్రతిని అందించారు. ఈ సందర్భంగా విజయుడు మాట్లాడుతూ గ్రామాల్లో ఏ సమస్య వచ్చినా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని చెప్పారు. ప్రతినిత్యం గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామాన్ని సమస్యల్లేని గ్రామంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.
వడ్డేపల్లి మండలం శాంతినగర్ గ్రామ వాసి రాణి అనే మహిళ ఆపరేషన్ కొరకు రూ.5 లక్షల ఎల్ఓసీ ప్రతిని ఆమె కుటుంబ సభ్యులకు అందించామని విజయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు గజేంద్ర రెడ్డి, రఘు రెడ్డి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.